ఇదే ప‌ని జ‌గ‌న్ చేసి ఉంటే…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌నిని బ‌ట్టి కాక‌…చేసే వ్య‌క్తుల‌ను బ‌ట్టి త‌ప్పొప్పుల‌ను నిర్ధారిస్తున్నారు.  ఎక్క‌డైనా త‌ప్పు త‌ప్పుగానూ, ఒప్పు ఒప్పుగానే క‌నిపిస్తాయి, క‌నిపించాలి కూడా. కానీ త‌ప్పొప్ప‌ల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వేర్వేరు నిర్వ‌చ‌నాలున్నాయి. అదే ఈ రాష్ట్ర ప్ర‌త్యేక‌త‌.…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌నిని బ‌ట్టి కాక‌…చేసే వ్య‌క్తుల‌ను బ‌ట్టి త‌ప్పొప్పుల‌ను నిర్ధారిస్తున్నారు.  ఎక్క‌డైనా త‌ప్పు త‌ప్పుగానూ, ఒప్పు ఒప్పుగానే క‌నిపిస్తాయి, క‌నిపించాలి కూడా. కానీ త‌ప్పొప్ప‌ల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వేర్వేరు నిర్వ‌చ‌నాలున్నాయి. అదే ఈ రాష్ట్ర ప్ర‌త్యేక‌త‌. ప‌నిని బ‌ట్టే కాదు, కాలాల‌ను బ‌ట్టి వాటి నిర్వ‌చ‌నాలు మారుతున్నాయి. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందైతే ఏపీ స‌ర్కార్ ఏం చేసినా ఆహా, ఓహో అంటూ శివ‌మ‌ణి డ్ర‌మ్స్ వాయించే ఎల్లో ప్ర‌సార మాధ్య‌మాలు కాస్త ప్ర‌చార మాధ్య‌మాలుగా ప‌ని చేశాయి.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికార మార్పిడి జ‌ర‌గ‌డంతో త‌ప్పొప్ప‌ల‌కు కూడా నిర్వ‌చ‌నాలు మారాయి. ప్ర‌స్తుతానికి వ‌స్తే క‌రోనా మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నాయి. వ‌చ్చే నెల 3వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగించాల‌ని ప్ర‌ధాని మోడీ పిలుపును దేశంలోని అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌క్కాగా అమ‌లు చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ నెల 15వ తేదీన జారీ చేసిన మార్గదర్శకాల్లో కేంద్రం మరికొన్ని సడలింపులను చేర్చింది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రామీణ ప్రాంతాల్లోని షాప్స్‌. రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు, మార్కెట్‌ కాంప్లెక్స్‌లలో ఉన్న షాపులకూ సడలింపు వర్తిస్తుంది. అయితే సింగిల్‌ బ్రాండ్, మల్టీ బ్రాండ్‌ మాల్స్‌కు మాత్రం ఇది వర్తించదు.

మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో నిబంధ‌న‌ల మేర‌కు ఉన్న షాప్స్‌కు సడలింపు వర్తిస్తుంది. ఇరుగుపొరుగున ఉన్న షాపులు, స్టాండ్‌ ఎలోన్‌ షాపులు, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లలో ఉన్న షాపులకూ ఇది వర్తిస్తుంది. ఈ జాబితాలో దుస్తులు, సెల్‌ఫోన్, హార్డువేర్, స్టేషనరీ దుకాణాలు తెరవచ్చు. అయితే అన్ని చోట్ల‌  50 శాతం మించకుండా సిబ్బంది, మాస్కులు ధరించ‌డం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించ‌డం త‌ప్ప‌ని స‌రి.

ఒక‌వేళ ఏపీ సీఎం జ‌గ‌న్ ఇవే స‌డ‌లింపులు చేసి ఉంటే భూమి బ‌ద్ద‌ల‌య్యేలా ప్ర‌తిప‌క్షాలు, వాటి బాకా ప‌త్రిక‌లు, చాన‌ళ్లు ర‌చ్చ‌ర‌చ్చ చేసేవి. జ‌గ‌న్‌కు రాష్ట్ర ప్ర‌జ‌ల ప్రాణాలంటే లెక్క‌లేద‌ని గ‌గ్గోలు పెట్టేవాళ్లు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల కోస‌మే స‌డ‌లింపులిచ్చార‌ని పెద్ద ఎత్తున విమర్శ‌లు గుప్పించే వాళ్లు. వెంట‌నే కేంద్రం జోక్యం చేసుకుని, లాక్‌డౌన్‌ను ఎలాంటి స‌డ‌లింపులు లేకుండా చేప‌ట్టాల‌ని డిమాండ్ చేసేవాళ్లు. కానీ కేంద్ర ప్ర‌భుత్వం స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో ఏ ఒక్క రాజ‌కీయ పార్టీ, ప‌త్రిక‌, చాన‌ల్ కిక్కుర‌మ‌న‌డం లేదు. ఎందుకంటే స‌డ‌లింపులిచ్చింది ప్ర‌ధాని మోడీ కాబ‌ట్టి. మోడీ చేస్తే…ప్ర‌జ‌ల ప్రాణాల‌కు ముప్పు వాటిల్లినా ఫ‌ర్వాలేద‌న్న మాట‌. 

పుట్టిన రోజు ఇలా కూడా చేసుకుంటారా