ఇలాంటి వానలు పడతాయని అనుకోలేదు!

తమ జన్మలో చూడని వర్షాలను కూడా ఇప్పుడు చూసినట్టుగా రాయలసీమ ప్రాంతంలోని కొందరు వృద్ధులు వ్యాఖ్యానిస్తూ ఉండటం గమనార్హం. ఈ సీజన్ లో రాయలసీమలో నమోదైన వర్షపాతం పట్ల ఆ ప్రాంత వాసులే ఆశ్చర్యపోతూ…

తమ జన్మలో చూడని వర్షాలను కూడా ఇప్పుడు చూసినట్టుగా రాయలసీమ ప్రాంతంలోని కొందరు వృద్ధులు వ్యాఖ్యానిస్తూ ఉండటం గమనార్హం. ఈ సీజన్ లో రాయలసీమలో నమోదైన వర్షపాతం పట్ల ఆ ప్రాంత వాసులే ఆశ్చర్యపోతూ ఉన్నారు. వర్షాలు ఇక వస్తాయా.. అనే సందేహంతో బతుకుతున్న వాళ్లు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యే వర్షాలు పడ్డాయి! కొన్ని ఊర్లలో అయితే రోజుల తరబడి.. ఆగకుండా వన దంచి కొట్టింది!

రాత్రికి రాత్రి కొన్ని చెరువులు నిండిపోయాయి. మరువలు పోయాయి. రాళ్లు తేలిన కొన్ని వంకలు ఈ సంవత్సరం సాగాయి. ఆ వంకల్లో చాలా సంవత్సరాల నుంచి నీళ్లు ప్రవహించిన దాఖలాలు లేవు. అలాంటి వాగులు, వంకలు ముందుకు సాగడం, వాటికి అనుసంధానం అయిన చెరువుల్లోకి నీటిని పంపడం జరిగింది. ఇలాంటి అరుదైన దృశ్యాలు ఈ సంవత్సరం రాయలసీమలో చోటు చేసుకున్నాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయి వర్షపాతం నమోదు అయ్యింది కొన్ని చోట్ల.

ఇంకా వర్షానికి అవకాశాలున్నాయి. దసరా సమయంలో భారీ వర్షానికి అవకాశాలు ఉండనే ఉంది. ఇప్పటికే  పడిన వర్షాలతో ఎంతో కొంత భూగర్భ జలాల పరిస్థితి మెరుగు అయ్యింది. వ్యవసాయం ఈసారి పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇదే సమయంలో రాయలసీమ ప్రాంతం గుండా సాగే సాగునీటి ప్రాజెక్టుల కాలువలు కూడా ఉరకలేస్తూ  ఉన్నాయి. ఏతావాతా.. సీమకు శుభసూచకంగా ఉన్నాయి ఈ వర్షాలు!

సినిమా వస్తేనే.. యోధుడు గుర్తుకు వచ్చాడు!