ఆర్ ఆర్ ఆర్ సినిమా చకచకా ముస్తాబు అవుతోంది. సమ్మర్ కు కాస్త ఆటు ఇటుగా థియేటర్లలోకి వస్తుంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఎప్పుడు ఒక్కటి అవుతారు? ఎప్పుడు ఒక్కటై పోరుబాట నడుస్తారు? అన్న పాయింట్ మీద ఇంట్రస్టింగ్ గ్యాసిప్ వినిపిస్తోంది.
ఓ చిన్న పాపను కాపాడే ఎపిసోడ్ ఆర్ ఆర్ ఆర్ లో కీలకంగా వుంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రాణాలకు తెగించి, ఆ పాపను కాపాడడంతో, రామ్ చరణ్ అతనితో చేతులు కలిపి, పోరుబాటకు దిగుతాడని తెలుస్తోంది. సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రన్స్ పులితో ఫైట్ తో వుంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే సినిమాలో మూడు మహా అయితే నాలుగు పాటలకు మించి వుండవు అన్నసంగతీ ఇప్పటికే తెలిసిందే.
ఇక ఆర్ ఆర్ ఆర్ అనే టైటిల్ కు ఫ్యాన్స్ నుంచి సినిమా అభిమానుల నుంచి ఎబ్రివేషన్ సలహాలు కోరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మేరకు వందలాది టైటిళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ లో ఆర్ ఆర్ ఆర్ అంటే ఏదో ఒకటి సెట్ అవుతోంది కానీ, తెలుగులోనే కష్టంగా వున్నట్లు టాక్. దీంతో రకరకాల వదంతుల వినిపిస్తున్నాయి. కానీ ఏదీ ఖరారు కాలేదని యూనిట్ వర్గాల బోగట్టా.