టీడీపీలో కళా స్వచ్చంద నిర్బంధం?

ఆయన  పేరుకు తెలుగుదేశం పార్టీకి ఏపీ అధ్యక్షుడు. శ్రీకాకుళానికి చెందిన సీనియర్ నేత కళా వెంకటరావు. ఆయనది కూడా నాలుగు దశాబ్దాల రాజకీయమే. అయితే  మరి అదే పార్టీకి  చంద్రబాబేమో జాతీయ అధ్యక్షుడు. ఆయన‌…

ఆయన  పేరుకు తెలుగుదేశం పార్టీకి ఏపీ అధ్యక్షుడు. శ్రీకాకుళానికి చెందిన సీనియర్ నేత కళా వెంకటరావు. ఆయనది కూడా నాలుగు దశాబ్దాల రాజకీయమే. అయితే  మరి అదే పార్టీకి  చంద్రబాబేమో జాతీయ అధ్యక్షుడు. ఆయన‌ ఏ ఢిల్లీలో ఉండి అమరావతి ఆఫీసుని కళాకు అప్పగించలేదు. దాంతో కళా పదవి  పార్టీలో ఆరోవేలుగా మారింది.

ప్రెస్ నోట్లలో రాసుకునేందుకు తప్ప దాని వల్ల ఉపయోగం లేదని మాజీ మంత్రికి అర్ధమైనా కూడా ఇపుడున్న పొలిటికల్ సీన్లో అంతకంటే హోదా వేరే లేనందువల్ల మెల్లగా   సర్దుకున్నారు. అయితే ఆ హోదాకు కూడా ఎసరు పెట్టేలా పార్టీలో పరిణామాలు జోరుగా  జరుగుతున్నాయట.

కళాను తప్పించి అదే జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడుకి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కిరీటం కట్టబెడతారని అంటున్నారు. దాంతో కళా ఇపుడు  చడీ చప్పుడూ చేయడంలేదని అంటున్నారు.

మరో వైపు చూసుకుంటే ఆయన సొంత నియోజకవర్గం ఎచ్చెర్లలో ఎంపీటీసీల‌న్నీ వైసీపీకి ఏకగ్రీవం కావడంతో ఉన్న చోటే కళా పరువు పోయినట్లైంది. టీడీపీ వర్గ పోరు వల్ల  కూడా కళా ఇబ్బందులు  పడుతున్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్ తరువాత కళా స్వచ్చంద నిర్బంధం విధించుకున్నారని టాక్. ఆయన పార్టీలో యాక్టివ్ గా ఉండకుందా ఐసోలేట్ అవుతున్నారని పచ్చ పార్టీలో చర్చ సాగుతోంది. మొత్తానికి సొంత పార్టీలోనే  కళా కాంతులు తగ్గిపోవడంతో సిక్కోలు పెద్దాయన రాజకీయ ఏకాంతవాసాన్ని ఎంచుకున్నారని, ఆయన పేరు మీద ప్రెస్ నోట్లు మాత్రం అమరావతి ఆఫీస్ నుంచి వస్తున్నాయని అంటున్నారు.

కేసీఆర్ బతికున్నంత వరకూ ఏ కష్టం రాదు