లాక్ డౌన్ టైమ్ లో దాని కోసమే వెదుకులాట..!

లాక్ డౌన్ టైమ్ లో ఖాళీగా ఉన్నవారంతా ఏం చేశారు. సెల్ ఫోన్లు, కంప్యూటర్లో ఏం చూస్తున్నారు. దీనిపై ఓ ఆసక్తికర సర్వే జరిగింది. ఆ సర్వేలో అంతకంటే ఆసక్తికరమైన ఫలితాలు వెలువడ్డాయి. Advertisement…

లాక్ డౌన్ టైమ్ లో ఖాళీగా ఉన్నవారంతా ఏం చేశారు. సెల్ ఫోన్లు, కంప్యూటర్లో ఏం చూస్తున్నారు. దీనిపై ఓ ఆసక్తికర సర్వే జరిగింది. ఆ సర్వేలో అంతకంటే ఆసక్తికరమైన ఫలితాలు వెలువడ్డాయి.

లాక్ డౌన్ తొలి దశలో భారతీయులే కాదు.. ప్రపంచమంతా కరోనా వార్తల కోసం తెగ వెదికింది. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు కనిపెడతారనేదే టాప్ సెర్చింగ్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత ఆన్ లైన్ ఉద్యోగాలు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, వెరైటీ వంటకాలు.. ఇలా సాగింది అందరి వెదుకులాట. కానీ లాక్ డౌన్ పార్ట్ -2 కాస్త భిన్నంగా ఉంది.

లాక్ డౌన్ పార్ట్-2లో మహా అయితే ఆనందయ్య మందు హైలెట్ అయింది అనుకుంటారంతా. ఆమధ్య సోషల్ మీడియాలో ఆనందయ్య మందు గురించి జరిగిన హడావిడి, జాతీయ ఛానెల్స్ లో జరిగిన ప్రచారం చూస్తే ఎవరైనా ఇదే టాప్ సెర్చింగ్ టాపిక్ అనుకోవచ్చు. కానీ అంతకంటే ముఖ్యమైనది భారతీయులకు ఇంకోటి ఉంది. అదే అందం. అవును.. అందం కోసమే సగటు భారతీయుడు వెదుకులాట మొదలు పెట్టాడు.

దేశవ్యాప్తంగా 8 నగరాల్లో దాదాపు 2లక్షలమందికి పైగా వాలంటీర్లపై చేపట్టిన సర్వే ఈ విషయాలనే స్పష్టం చేసింది. ఢిల్లీలో బ్యూటీ కేర్ సర్వీసెసె, పెట్ కేర్, వీసా సర్వీసెస్, బ్యూటీ పార్లర్ అనే అంశాలు టాప్ సెర్చింగ్ లో ఉన్నాయి. అంటే ఉన్న నాలుగింటిలో రెండు బ్యూటీ గురించేనన్నమాట. 

ఇంటి పట్టున ఉంటూ అందాన్ని మెరుగు పరుచుకోవడం ఎలా అనే అంశాన్ని అమ్మాయిలు, అబ్బాయిలు విపరీతంగా శోధించారు. అదే సమయంలో ఇంటికి దగ్గర్లో ఉన్న బ్యూటీ పార్లర్లు ఏంటి..? లాక్ డౌన్ టైమ్ లోకూడా బ్యూటీపార్లర్ కి వెళ్లడం ఎలా అని ఆలోచించారు.

చెన్నై, బెంగళూరులో కూడా బ్యూటీదే తొలి స్థానం. వీరంతా బ్యూటీ పార్లర్స్, బ్యూటీ కేర్ అనే విషయాల గురించే ఎక్కువగా సెర్చ్ చేశారు. ఇక ముంబై విషయానికొస్తే జాబ్ ట్రైనింగ్ అనేది మొదటి స్థానంలో ఉండగా, బ్యూటీ రెండో స్థానానికి పడిపోయింది. హైదరాబాద్ వాసులు కూడా బ్యూటీకి రెండో స్థానమిచ్చారు. హైదరాబాద్ వాసులు అత్యథికంగా సెర్చ్ చేసింది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కోసం అని సర్వేలో తేలింది.

మొత్తమ్మీద లాక్ డౌన్ సెకండ్ ఫేజ్ వచ్చేనాటికి జనాల్లో కరోనా భయం బాగా తగ్గిపోయింది. టీకాపై ఉన్న ఆసక్తి కూడా పూర్తిగా తగ్గిపోయింది. అందంపై ఆసక్తి పెరిగింది. చివరకు ఉపాధి, చదువు, ఆరోగ్యం అనే విషయాలన్నీ పక్కకుపోయాయి.