Advertisement

Advertisement


Home > Movies - Movie News

'మా'..మూడు నెలల ముందు నుంచే...

'మా'..మూడు నెలల ముందు నుంచే...

తెలుగు సినిమా నటీనటుల సంఘం 'మా' ఎన్నికల హడావుడి వున్నట్లుండి మొదలయింది. ఉన్నట్లుండి మొదలయినట్లు కనిపిస్తోంది కానీ ఇది తెరవెనుక మూడు నెలల ముందే స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. మూడు నెలల నుంచే మా అధ్యక్షపదవికి పోటీ చేయాలని ప్రకాష్ రాజ్ సన్నాహాలు చేసుకుంటున్నారని బోగట్టా. వకీల్ సాబ్ ప్రమోషన్ ఇంటర్వ్యూలను ఆయన ముందుగా దీనికి ఫౌండేషన్ గా వాడుకున్నట్లు కనిపిస్తోంది.

అంతకు ముందు పవన్ తో తనకు వున్న సైద్దాంతిక విబేధాలను, పవన్ పై తను చేసిన కామెంట్లను ఆ ఇంటర్వ్యూలతో చెరిపేసే ప్రయత్నం చేసినట్లు తెలిసిపోతోంది. అదే సమయంలో చిరు అనుమతి కూడా ముందే తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ సన్నాహాలు ఇలా వుంటే, సిట్టింగ్ అధ్యక్షుడు నరేష్ కూడా ముందుగానే పావులు కదిపినట్లు బోగట్టా.

గత కరోనా, అలాగే ఈ కరోనా టైమ్ లో ఆయన తన వర్గానికి చెందిన రెండు వందల మంది చేజారకుండా నరేష్ చూసుకుంటూ వచ్చారు. వారందరినీ ఎలా ఆదుకోవాలో అలా ఆదుకుంటూ వచ్చారు. ఆయనకు తన తరువాత కూడా మా మీద పట్టు పోకుండా, తన కేండిడేట్ అనే వ్యక్తి ఎవరు అని ప్లాన్ చేసుకుంటూ వచ్చినట్లు తెలుస్తోంది. 

ఈ సమయంలో మంచు విష్ణుకు ఆసక్తి వుందని తెలియడంతో ఆ దిశగా నరేష్ పావులు కదిపారు. ఇప్పటికే ఎన్నికలను ఫేస్ చేసిన అనుభవం వుండడంతో, ఆ వ్యూహాలు అన్నీ విష్ణు కోసం నరేష్ వాడుతున్నారు. సీనియర్లు కృష్ణ, కృష్ణంరాజులను విష్ణు కలవడం వెనుక వ్యూహం నరేష్ దే అని తెలుస్తోంది.

గతంలో నరేష్ కు మద్దతుగా ముందుకు వచ్చిన మెగా సోదరుడు నాగబాబు ఇప్పుడు ప్రకాష్ రాజ్ వైపు వున్నారు. కళాకారులకు ప్రాంతీయ, భాష, స్థానిక బేధాలు వుండవని నచ్చ చెప్పే ప్రయత్నం ప్రారంభించారు. ఈ పోరులో ఎవరు గెలుస్తారు అన్నది పక్కన పెడితే ప్రకాష్ రాజ్ కు అంత సానుకూల వాతావరణం నటీనటుల్లో వున్నట్లు కనిపించడం లేదు.

ఓటింగ్ లో పాల్గొనేది ఎక్కువగా చిన్న, చితక నటులు. సెట్ లో ప్రకాష్ రాజ్ ఎవ్వరితోనూ కలివిడిగా వుండరని, చాలా రిజర్వుడ్ గా వుంటారని టాక్ వుంది. పైగా వివాదాస్పద వ్యక్తి అని పేరుపడిపోయారు. ప్రకాష్ రాజ్ కాకుండా మెగా క్యాంప్ నుంచి మరి ఎవ్వరైనా వ్యవహారం వేరుగా వుండేది. అలాగే విష్ణుకు నరేష్ మద్దతు లేకున్నా వేరుగా వుండేది. 

కానీ ఈ రెండు అంశాల రీత్యా వ్యవహారం ప్రస్తుతం విష్ణుకే ఎడ్జ్ కనిపిస్తోందని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. అయితే ప్రకాష్ రాజ్ కు మెగా క్యాంప్ మద్దతు అని ప్రచారం బయటకు వచ్చేసింది కాబట్టి, ఆ క్యాంప్ దీన్ని ఏమేరకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అన్నదాన్ని బట్టి ఎన్నికల వేడి వుంటుంది. లేదూ అంటే వడ్లగింజలో బియ్యపు గింజమాదిరిగా మిగిలిపోతుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?