Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఆ మంత్రులకు కరోనా కలిసొస్తుందా?

ఆ మంత్రులకు కరోనా కలిసొస్తుందా?

ఏడాదిన్నర నుంచి రాష్ట్రాన్ని, కరోనా పట్టి పీడిస్తోంది. జనాల్ని అష్టకష్టాలు పెడుతోంది. కానీ కొంతమందికి మాత్రం ఈసారి కరోనా కలిసొచ్చేలా ఉంది. కరోనా కారణంగా వారి మంత్రి పదవుల ఎక్స్ పయిరీ డేట్ మరింత వెనక్కి వెళ్లిబోతోంది. ప్రస్తుతం వినిపిస్తున్న లీకుల బట్టి చూస్తే, కొంతమంది మంత్రులు ఈసారి సేఫ్ జోన్ లోకి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది.

వాస్తవానికి రెండేళ్ల తర్వాత ఏపీ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాల్సి ఉంది. ఈమేరకు పదవీ స్వీకరణ రోజే మంత్రులకు క్లియర్ కట్ గా చెప్పేశారు సీఎం జగన్. ఆ గడువు ఇప్పుడు సమీపించింది. మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు మొదలవుతాయనే ఊగాహానాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే కరోనా కారణంగా ఎవరి బలాబలాలు ఏంటనేది సరిగా అంచనా వేయడం కష్టంగా మారింది.

ఈ టైమ్ లో ఓ నలుగురు మంత్రులు జగన్ దగ్గర ప్రత్యేక అనుమతి కోరారు. కరోనా కారణంగా తమ పనితీరు సరిగా చూపించలేకపోయామని, తమకు మరో అవకాశం ఇవ్వాలని ఆయన్ను కోరినట్టు తెలుస్తోంది.

కరోనా వల్ల దాదాపుగా కొన్ని శాఖల్లో పనులు పూర్తిగా పడకేశాయి. ఆయా మంత్రులు తమ సామర్థ్యం మేరకు పనులు చేయలేకపోయారనేది వాస్తవం. అదే సమయంలో కొన్నిశాఖలు మాత్రం చురుగ్గా పనిచేశాయి. ఈ దశలో పదవీ గండం ఎక్కువగా ఉందని వార్తలొస్తున్న నేపథ్యంలో నలుగురు మంత్రులు ముందుగానే అప్రమత్తం అయ్యారు.

కరోనా వల్ల తాము సరిగ్గా పనిచేయలేకపోయాని, తమకు మరో అవకాశం ఇవ్వాలని జగన్ ను కోరుతున్నారు. దాదాపు ఏడాదిపైగా కరోనా వల్ల తమ పనులేవీ జరగలేదని, తమ సామర్థ్యం బయటకు రాలేదని చెబుతున్నారు వీరు.

దీనికితోడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మంత్రిగా తమ పనితీరుపై ప్రభావం చూపాయని అంటున్నారు. ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టడం వల్ల, మిగతా విషయాలను పట్టించుకోలేకపోయామని, తమ విన్నపాన్ని మన్నించి కనీసం మరో ఏడాదైనా పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతున్నారు. అప్పటిలోగా తమను తాము నిరూపించుకుంటామని చెబుతున్నారు.

ఆ నలుగురి విషయంలో జగన్ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అదే సమయంలో మిగతావారిని తప్పించడం కూడా ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది. చూస్తుంటే, మంత్రి మండలిలో మార్పుచేర్పుల ప్రక్రియ వాయిదా పడేలా ఉంది. అదే నిజమైతే ఆశావహులకు సర్దిచెప్పడం మరింత కష్టం. 

ఇప్పటికే చాలామంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. వారిలో అసంతృప్తి రగిలే అవకాశం ఉంది. దీనిపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, రాబోయే 3-4 నెలల్లో తేలిపోతుంది.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?