బాబు సర్కార్ అసమర్ధతను అయ్యన్న చాటారా…?

ఏదేమైనా నిజాలు ఒక్కోసారి అలా గటగటా బయటకు వచ్చేస్తూంటాయి. ఎంత రాజకీయం అనుకున్నా, వ్యూహాల పేరిట దాటవేస్తున్నా కూడా ఫ్లోలో ఒక్కోసారి వాస్తవాలు అలా జారిపోకతప్పదు. Advertisement ఏపీలో ఆర్ధిక పరిస్థితి మీద మాజీ…

ఏదేమైనా నిజాలు ఒక్కోసారి అలా గటగటా బయటకు వచ్చేస్తూంటాయి. ఎంత రాజకీయం అనుకున్నా, వ్యూహాల పేరిట దాటవేస్తున్నా కూడా ఫ్లోలో ఒక్కోసారి వాస్తవాలు అలా జారిపోకతప్పదు.

ఏపీలో ఆర్ధిక పరిస్థితి మీద మాజీ మంత్రి సీనియర్ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు  గగ్గోలు పెడుతున్నారు. ఏపీలో నానాటికీ తీసికట్టుగా ఖజానా ఉందని కూడా ఆయన నొచ్చుకుంటున్నారు.మరి అయిదేళ్ళ తమ పాలనలో బంగారు బాతుగుడ్డులా ఖజానాను చేసిపెట్టి వైసీపీ సర్కార్ కి అందించాం అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు.

ఏపీలో 90 వేల కోట్ల అప్పుతో విభజన జరిగిందని అందరికీ తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వం రెండు లక్షల కోట్లు అప్పు చేసిందని వైసీపీ నేతలు అంటే అదేంలేదు అని ఇప్పటిదాకా డబాయించిన  తమ్ముళ్ళు ఇపుడు తాపీగా అవును అప్పు చేశాం, కానీ మీలా మరీ ఎక్కువగా కాదు అని సత్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చెబుతున్నారు.

ఇపుడు కూడా అలాంటి ఆణిముత్యాన్ని అయ్యన్న నోటి వెంట జాలువార్చారు. అదేంటి అంటే గత సర్కార్ వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 35 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సిఉందని నోరు జారారు. అంటే బడ్జెట్ లో ఏకంగా ఇది అయిదవ శాతం.

మరి ఓ వైపు లక్షల అప్పులు తెచ్చిన చంద్రబాబు సర్కార్ అమరావతి రాజధాని కట్టక, మరో వైపు ఏపీలో ప్రగతి పనులు జరగక ఇంకో వైపు వివిధ శాఖల నుంచి చెల్లించాల్సిన బకాయిలు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు పేరుకుపోయేలా చేసినట్లో.

అనుభవం కలిగిన  పాలన అంటే ఇదేనా అని వైసీపీ నేతలు అంటున్నారంటే జవాబు చెప్పాలి కదా. పైగా ఇప్పటికే గత సర్కార్ బకాయిలు మేము తీరుస్తున్నామని  వైసీపీ మంత్రులు చెబుతున్నారు. అయినా కూడా  ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పిందంటూ   ఆరోపణలు చేస్తున్న అయ్యన్న లాంటి వారు ఈ అప్పుల తప్పులు  ఎవరు పాపమో కూడా  చెప్పాలి కదా.

లేని పోని ఇబ్బందులు అనే ఆలోచనా? 

ప్రభుత్వం న్యాయ వ్యవస్థ చేతుల్లో ఉందా?