అక్కడ కాంగ్రెస్ సున్నా చుట్టినట్లేనా… ?

కాంగ్రెస్ పార్టీ ఒక దశాబ్దం క్రితం ఉమ్మడి ఏపీలో ఎంతో వైభోగం అనుభవించింది. ఒక విధంగా చెప్పాలంటే నాడు ఏపీలో వచ్చిన ఎంపీ సీట్లే కేంద్రంలోని యూపీయేని బలంగా అధికారంలో నిలబెట్టాయి. Advertisement అటువంటి…

కాంగ్రెస్ పార్టీ ఒక దశాబ్దం క్రితం ఉమ్మడి ఏపీలో ఎంతో వైభోగం అనుభవించింది. ఒక విధంగా చెప్పాలంటే నాడు ఏపీలో వచ్చిన ఎంపీ సీట్లే కేంద్రంలోని యూపీయేని బలంగా అధికారంలో నిలబెట్టాయి.

అటువంటి కాంగ్రెస్ విభజన తరువాత ఏపీలో బాగా దిగనారిపోయింది. ఎన్నిక ఎన్నికకూ ఆ పార్టీ తగ్గిపోతోంది. ఇక ఓట్ల శాతంలో కూడా భారీ క్షీణత కనిపిస్తోంది. మరో వైపు చూస్తే కాస్తా పేరున్న నాయకులు కూడా ఎపుడో తప్పుకున్నారు. ఇపుడు మిగిలిన వారు కూడా తమ దారి తాము చూసుకుంటున్న పరిస్థితి ఉంది.

రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న పేడాడ రమణికుమారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో తాజాగా పార్టీలో చేరిపోయారు. ఆమెను సాదరంగా ఆయన పార్టీలోకి ఆహ్వానించారు.

ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విశాఖ నుంచి కాంగ్రెస్ ఎంపీగా రమణి కుమారి పోటీ చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. ఆమె కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. దీంతో విశాఖ కాంగ్రెస్ లో గట్టి నేత లేకుండా పోయినట్లు అయినట్లు అయింది.