రాజన్న బాటలో జగనన్న!

ఉత్తరాంధ్రా జిల్లాలు అభివ్రుధ్ధి విషయంలోనే కాదు, సాగునీటికి, తాగునీటికి కూడా కటకటలాడుతున్నాయి. ముఖ్యంగా విశాఖ పారిశ్రామికంగా ప్రగతి సాధిస్తున్న వేళ దాహార్తి కూడా పెరిగిపోతోంది. పెరుగుతున్న జనాభాతో నీటి కష్టాలు ఎక్కువ అవుతున్నాయి. Advertisement…

ఉత్తరాంధ్రా జిల్లాలు అభివ్రుధ్ధి విషయంలోనే కాదు, సాగునీటికి, తాగునీటికి కూడా కటకటలాడుతున్నాయి. ముఖ్యంగా విశాఖ పారిశ్రామికంగా ప్రగతి సాధిస్తున్న వేళ దాహార్తి కూడా పెరిగిపోతోంది. పెరుగుతున్న జనాభాతో నీటి కష్టాలు ఎక్కువ అవుతున్నాయి.

ఇక నీటి వనరులు సక్రమంగా లేకపోవడం వల్ల గోదావరి నీటి మీదనే విశాఖ జనం కూడా ఆధారపడుతున్నారు. దాంతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పధకానికి వైఎస్సార్ 2009లో శ్రీకారం చుట్టారు. అయితే ఆయన ఈ లోకాన్ని వీడిపోవడంతో పదకొండేళ్ళుగా ఈ పధకం అలా మూలన పడిఉంది.

ఇపుడు సాగునీటి పధకాలపైన ద్రుష్టి సారించిన ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రాకు మేలు చేసే బహుళార్ధక ప్రాజెక్ట్ అయిన సుజల స్రవంతి పధకానికి మళ్ళీ ఊపిరిపోస్తున్నారు. ఏకంగా ఆరు వేల కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ టెండర్లను తాజాగా పిలవడంతో ఈ మూడు జిల్లాలూ పులకించిపోతున్నాయి.

ఈ పధకం కనుక పూర్తి అయితే ముప్పయి లక్షల  మందికి తాగు నీరు అందడమే కాదు, లక్షా 30 వేల  ఎకరాల‌ సాగు భూములకు  నీరు అందుబాటులోకి వస్తుంది. ఓ విధంగా ఉత్తరాంధ్రా మీద ప్రేమతో నాడు రాజన్న శ్రీకారం చుడితే జగనన్న పూర్తి చేసేందుకు నడుం బిగించడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రానున్న నాలుగేళ్ళ కాలంలో ఈ పధకం పూర్తి అవుతుందన్న నమ్మకాన్ని కూడా అంతా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తండ్రి బాటలో తనయుడు సాగునీటి పధకాలకు స్వాగతం పలకడం శుభపరిణామంగా అంతా చూస్తున్నారు.

లోకేష్ ని చూస్తే వణుకు వచ్చేస్తుంది

కత్తి మహేష్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ