ఎట్టకేలకు మొదలైన రెవెన్యూ ప్రక్షాళన

రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళణ దిశగా తొలి అడుగు పడింది. క్షేత్రస్థాయి సిబ్బంది వీఆర్వోల విధుల్లో మార్పులు తెస్తూ, ఏకంగా వారి హోదాను కూడా మార్చేశారు. వీఆర్వోలను, వీఆర్ఎస్ లుగా మారుస్తూ ప్రభుత్వం జీవో…

రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళణ దిశగా తొలి అడుగు పడింది. క్షేత్రస్థాయి సిబ్బంది వీఆర్వోల విధుల్లో మార్పులు తెస్తూ, ఏకంగా వారి హోదాను కూడా మార్చేశారు. వీఆర్వోలను, వీఆర్ఎస్ లుగా మారుస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇలాంటి మార్పుకోసం కేసీఆర్ ఐదున్నరేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఆయనకు అది సాధ్యంకాలేదు. చడీ చప్పుడు లేకుండా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రక్షాళణ మొదలు పెట్టారు. సగం పని పూర్తిచేశారు.

లంచాల మేతకు అత్యధిక అవకాశం ఉన్న రెవెన్యూ డిపార్ట్ మెంట్ ని విభజించి పాలిస్తేనే ప్రక్షాళణ సాధ్యమవుతుంది. అందుకే ఇదే సూత్రాన్ని అమలు చేస్తున్నారు జగన్. రైతులు, ప్రజల దగ్గరనుంచి నేరులా లంచాలు తీసుకునేది వీఆర్వోలే, ఆ తర్వాత పైస్థాయి అధికారులైన ఆర్.ఐ.లు, డిప్యూటీ తహశీల్దార్లు, తహశీల్దార్లకు వాటాలు వెళ్తాయి.

అసలు వీఆర్వోల అధికారాలకే కత్తెర వేస్తే, ఆ అధికారాన్ని గ్రామ సచివాలయానికి కట్టబెట్టి ఉద్యోగులందర్నీ బాధ్యులుగా చేస్తే.. ఇక లంచాల మేతకు అవకాశమెక్కడుంటుంది. అందుకే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి దానికి పంచాయతీ సెక్రటరీని, సర్పంచిని కూడా బాధ్యులుగా చేశారు జగన్. జవాబుదారీ తనం పెరిగేందుకు బాటలు వేశారు.

గతంలో ఓసారి ఇలాగే వీఆర్వోల హోదాను మార్చినప్పుడు పెద్ద ఉద్యమమే జరిగింది, అంతెందుకు ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది కూడా అదే. అయితే అక్కడ కేసీఆర్ ధైర్యం చేయలేకపోతున్నారు, అసలు ప్రక్షాళణ ఎలా మొదలు పెట్టాలో తెలియక, ఉద్యోగుల ఒత్తిళ్లను భరించలేక సతమతమవుతున్నారు. కానీ జగన్ ఇక్కడ కీలెరిగి వాతపెట్టారు.

లంచాల మేతకు అవకాశం లేకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా, ఏసీబీకి పని తగ్గిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తొలిదశలో క్షేత్రస్థాయి సిబ్బంది వీఆర్వోల అధికారాలకు, హోదాకు కత్తెర పడింది. మలిదశలో ఇక ఎవరిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్ట్రోక్ తో రెవెన్యూ డిపార్ట్ మెంట్ అంతా సర్దుకుంటుంది.

సచివాలయ వ్యవస్థతో లంచాల బాధ తప్పుతుందని సామాన్యులు సంబరపడుతున్నారు. ఈ మార్పు పూర్తి స్థాయిలో విజయవంతం అయితే.. గతంలో మున్సబు, కరణాల వ్యవస్థను రద్దుచేసిన ఎన్టీఆర్ లాగా.. జగన్ కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. 

సినిమా రివ్యూ: ఆర్‌డిఎక్స్‌ లవ్‌