జగన్ దయతోనే చంద్రబాబుకు పదవి?

చంద్రబాబు ఇపుడు చూపిస్తున్న దర్జా, ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా. ప్రోటోకాల్ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దయ, ప్రాప్తమేనా. ఎన్నో నీతులు చెప్పే బీజేపీ మధ్యప్రదేశ్, కర్నాటకలో విపక్ష ఎమ్మెల్యేలను…

చంద్రబాబు ఇపుడు చూపిస్తున్న దర్జా, ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా. ప్రోటోకాల్ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దయ, ప్రాప్తమేనా. ఎన్నో నీతులు చెప్పే బీజేపీ మధ్యప్రదేశ్, కర్నాటకలో విపక్ష ఎమ్మెల్యేలను ఎలా లాగేసిందో అందరికీ ఎరుకే.

ఇక పొరుగున తెలంగాణా రాష్ట్రంలో చూస్తే అసలు ప్రతిపక్షాన్ని టోటల్ గా  చీల్చిచెండాడారు.  20కి పైగా సీట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ అక్కడ ఇపుడు ఉనికిపాట్లు పడుతోంది. అంతెందుకు గత అయిదేళ్ళ చంద్రబాబు పాలనలో అయితే ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను సైకిలెక్కించేసి చంద్రబాబు భలే ఎత్తు వేశానని మురిసిపోయారు.

సరిగ్గా అంతే సంఖ్యలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్క దెబ్బకు ఈ వైపుగా లాగేయడం జగన్ కి ఏమంత కష్టం కూడా కాదు, కానీ జగన్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తన పార్టీలోకి రావాలని గట్టి  షరతు పెట్టారు. మొత్తానికి ఆ కండిషన్ చంద్రబాబుకు బాగా అక్కరకు వచ్చింది.

అయినా కూడా ఆయన సర్కార్ మీద బురద జల్లుతూ ఒక లెక్కన విమర్శలు చేస్తున్నారు. దీని మీద వైసీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు హాట్ కామెంట్స్ చేశారు, ఇపుడు మీరు అనుభవిస్తున్న విపక్ష పదవి జగన్ దయ అనేశారు. జగన్ కనుక ఓకే అంటే ఒక్కరు కూడా బాబు వెంట మిగలరు అని కూడా జోస్యం చెప్పేశారు.

నిత్యం అబద్దాలు ప్రచారం చేస్తూ రెచ్చగొట్టుడు రాజకీయం చేస్తున్న బాబు లాంటి విపక్షాన్ని జగన్ చాలా సహనంగా భరిస్తున్నారు కాబట్టే పచ్చ పార్టీ ఇంతలా చెలరేగుతోందని కూడా అయన అంటున్నారు. మొత్తానికి బాబుకు ఈ రాజకీయ  స్ప్రుహ, అవగాహన ఉన్నాయో లేవో కానీ మరీ తెగేదాకా రాజకీయం చేస్తే జగన్ కూడా నిర్ణయం మార్చుకుంటే అపుడు సైకిల్ పార్టీ కుదేలేనని దాడి చెప్పకనే చెప్పేశారు. ఆ మీదట బాబుతో పాటు పచ్చ పార్టీ తమ్ముళ్ల ఇష్టం.

బాబు లోకేష్.. వణుకు పుడుతోందా?