దటీజ్ జగన్.. ఒక్క నేతన్నకు కూడా నష్టం జరగదు

పథకాల అమలు అంటే ఏదో ఇచ్చాం, పబ్లిసిటీ చేసుకున్నాం, చేతులు దులుపుకున్నాం అన్నట్టు ఉండేది చంద్రబాబు జమానాలో. కానీ జగన్ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది.  Advertisement పథకాలు కొందరికి మాత్రమే, మరీ ముఖ్యంగా…

పథకాల అమలు అంటే ఏదో ఇచ్చాం, పబ్లిసిటీ చేసుకున్నాం, చేతులు దులుపుకున్నాం అన్నట్టు ఉండేది చంద్రబాబు జమానాలో. కానీ జగన్ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. 

పథకాలు కొందరికి మాత్రమే, మరీ ముఖ్యంగా పార్టీ మనుషులకు మాత్రమే అనే అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశారు ముఖ్యమంత్రి. లబ్దిదారుల్ని వెదికిపట్టుకొని మరీ వాళ్లకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

నిన్నటికినిన్న వైఎస్ఆర్ వాహనమిత్ర కింద ఇంకా ఎవరైనా లబ్దిదారులు మిస్సయ్యారేమో అని వెదికి మరీ రెండో విడత నిధులు విడుదల చేశారు. 49,257 మంది  లబ్దిదారుల్ని గుర్తించి, వాళ్ల ఖాతాలో నగదు జమచేశారు. అలా ఆటోడ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడ్డారు జగన్.

ఇప్పుడు నేతన్న నేస్తం విషయంలో కూడా అదే పద్ధతి ఫాలో అవుతూ.. తను ప్రజల మనిషినని చేతల ద్వారా చూపిస్తున్నారు. వైఎస్ఆర్ నేతన్ననేస్తం పథకం కింద అర్హులై, మిస్సయిన 8903 మందిని గుర్తించింది ప్రభుత్వం. 

అలా మిస్సయిన ఈ చేనేత కార్మికులందరికీ 24వేల రూపాయలు చొప్పున 21 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ఈరోజు అందించబోతోంది. దీంతో ప్రతి చేనేత కార్మికుడికి లబ్ది చేకూరినట్టవుతుంది.

ఇప్పటికే ఈ పథకాన్ని రెండు సార్లు అమలుచేశారు. రెండు దశల్లో 81703 లబ్దిదారుల్ని గుర్తించారు. వాళ్లకు 362 కోట్ల రూపాయల్ని అందించారు. అర్హత ఉండి సంక్షేమ ఫలాల్ని అందుకోలేకపోయిన మిగతా లబ్దిదారుల్ని కూడా గుర్తించి, వాళ్లకు ఈరోజు నగదును అందించబోతున్నారు

వాహనమిత్ర అయినా, నేతన్న నేస్తం అయినా.. చివరికి పింఛన్లు అయినా… పథకం ఏదైనా అందులో నూటికి నూరు శాతం లబ్దిదారులు సంతృప్తి పొందాలనేది జగన్ ఆశయం. ఆ లక్ష్యంతోనే ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నారు. సంక్షేమంలో, పేదలను ఆదుకోవడంలో తనకు ఎవరూ సాటిరారని నిరూపించుకున్నారు.

ఈ విజయం భాజపా దా? రఘునందన్ దా?