తెలుగుదేశం అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ జైటీడీపీ హ్యాకింగ్ కు గరైనట్లు కనిపిస్తోంది. ఆ హ్యాండిల్ లోకి వెళ్తే కొన్ని ఫొటోలు వాటికి వందలాది కామెంట్లు, అది కూడా సేమ్ హ్యాండిల్ నుంచి కనిపిస్తున్నాయి.
వాస్తవానికి ఈ హ్యాండిల్ కన్నా లోకేష్ హ్యాండిల్ నే ఎక్కువ యాక్టివ్ గా వుంటుంది. అలాగే చంద్రబాబు హ్యాండిల్ కూడా కొంత వరకు యాక్టివ్ గానే వుంటుంది.
జై టీడీపీ హ్యాండిల్ ను ఎవరు హ్యాక్ చేసారో అన్నది తెలియదు. ఓ రీజనల్ పార్టీ హ్యాండిల్ ను హ్యాక్ చేసేంత పని ఇంటర్నేషనల్ హ్యాకర్లు చేస్తారా? అన్నది అనుమానమే. దీన్ని రిస్టోర్ చేసుకోవాల్సి వుంది.
హ్యాక్ కు గురయినా, అంతకు ముందు చేసిన ట్వీట్ లు, పోస్ట్ చేసిన మీడియాలు, లింక్ అన్నీ అలాగే వున్నాయి. వాటిని ఏమీ టచ్ చేయలేదు. డైరక్ట్ హోమ్ పేజీలో మాత్రమే ఏమీ కనిపించడం లేదు.
ముందు రోజు రాత్రి లేదా ఈ ఉదయం జరిగి వుంటుంది కనుక ఇంకా రిస్టోర్ చేయలేదు అనుకోవాలి. తెలుగుదేశం మీడియా వింగ్, ట్విట్టర్ మేనేజ్ మెంట్ వింగ్ గమనిస్తే వెంటనే సరిచేసే అవకాశం వుంది.