విశాఖలో పేదల పండుగ… జగన్ ముఖ్య అతిథి… ?

అతి పెద్ద పేదల పండుగ విశాఖలో జరగనుంది. పేదలకు గూడు దొరకడమే ఆ పెద్ద పండుగ. ఏపీలో అందరికీ ఇళ్ళ పట్టాలు ఎపుడో ఇచ్చినా విశాఖ వాసులకు మాత్రం ఆ సౌభాగ్యం దక్కలేదు. దానికి…

అతి పెద్ద పేదల పండుగ విశాఖలో జరగనుంది. పేదలకు గూడు దొరకడమే ఆ పెద్ద పండుగ. ఏపీలో అందరికీ ఇళ్ళ పట్టాలు ఎపుడో ఇచ్చినా విశాఖ వాసులకు మాత్రం ఆ సౌభాగ్యం దక్కలేదు. దానికి కారణం విశాఖలో ప్రభుత్వం సేకరించిన భూముల మీద కొందరు కోర్టుకు వెళ్ళడం. 

మొత్తానికి కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాంతో  అరు వేలకు పైగా ఎకరాలల్లో రెండు లక్షల మంది పేదలకు విశాఖ పరిసరాలలో ఇళ్ళ పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం అయింది.

ఈ పట్టాల విలువ చాలా ఎక్కువ అని మంత్రి అవంతి శ్రీనివాస్ అంటున్నారు. సిటీలో ఒక్కో లబ్దిదారునకూ డెబ్బై గజాల స్థలాన్ని పట్టాగా ఇస్తున్నారు. గజం విశాఖ పరిసర ప్రాంతాలలో పాతిక‌ వేల నుంచి ముప్పై వేల దాకా ఉంది. అంటే ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ళ పట్టా ఖరీదు కచ్చితంగా 20 లక్షల రూపాయలకు పై మాటే అని మంత్రి చెబుతున్నారు.

ఈ అతి పెద్ద ఇళ్ళ పట్టా కార్యక్రమం ఈ నెల 30వ తేదీన జరగనుంది. విశాఖలో జరిగే పేదల ఇళ్ళ పట్టాల పండుగకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి. విశాఖలో ఆ రోజు జగన్ చేతుల మీదుగా ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడమే అతి పెద్ద పొలిటికల్ ఈక్వేషన్ గా ఆ పార్టీ వర్గాలు  చూస్తున్నాయి.

ఇది తమ ఘన విజయమని  కూడా చెబుతున్నాయి. విశాఖ వంటి మెగా సిటీలో పేదలకు గూడు ఇచ్చి వారిని ధనవంతులను చేసిన ఘనత జగన్ దే అంటున్నాయి. మరి విశాఖ వేదికగా జగన్ ఏం చెప్పబోతారన్నది కూడా ఆ రోజు చూడాలి.