జమిలి ఎన్నికలు ఎలా సాధ్యం?

ప్రధాని మోడీ నోట మరోసారి జమిలి ఎన్నికల విషయం ప్రస్తావనకు వచ్చింది. దేశానికి అత్యంత ఆవశ్యకం అని ఆయన గట్టిగా చెప్పారు.  Advertisement దేశంలో ప్రతి రెండు నెలలకు ఓసారి ఎక్కడో ఓ చోట…

ప్రధాని మోడీ నోట మరోసారి జమిలి ఎన్నికల విషయం ప్రస్తావనకు వచ్చింది. దేశానికి అత్యంత ఆవశ్యకం అని ఆయన గట్టిగా చెప్పారు. 

దేశంలో ప్రతి రెండు నెలలకు ఓసారి ఎక్కడో ఓ చోట ఎన్నికలు జరుగుతూనే వున్నాయని, అలాగే ఒకటికి పదిసార్లు ఓటర్ల జాబితా తయారుచేయడం వల్ల బోలెడు నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆయన అన్నారు.

మోడీ చెప్పిన మాటల్లో వాస్తవాలు కాదనలేం. కానీ ఎలా సాధ్యం? అన్నదే క్వశ్చను. పోనీ అన్ని పార్టీలు కలిసి ఓ మాట మీదకు వచ్చి, జరగాల్సిన ఎన్నికలను ఆపి, రాష్ట్రపతి పాలన పెట్టి, కాలపరిమితి వున్న అసెంబ్లీలను రద్దు చేయించి ముందస్తు ఎన్నికలు జరిపించడం అన్నది అంత సులువుగా జరిగే పని కాదు. 

కేంద్రానికి అంతటి విచక్షణాధికారాలు వున్నాయా? పోనీ పార్టీలను బతిమాలో, బెదిరించో ఒప్పించడం కూడా సాధ్యం కాదు. పైగా ప్రతి రాష్ట్రంలో, ప్రతి పార్టీ పరిస్థితి ఒకలా వుండదు. 

ముఖ్యంగా అధికారంలో వున్న పార్టీలు ఆను, పాను అన్నీ చూసుకుని కానీ ముందస్తు ఎన్నికలకు సై అనవు. పైగా అధికారాన్ని ఆరు నెలల ముందే వదులుకోవు. 

అలాగే ప్రభుత్వ కాలం అయిపోయినా, ముందస్తు ఎన్నికలను దృష్టిలో వుంచుకుని ప్రభుత్వాలు లేకుండా, రాష్ట్రపతి లేదా గవర్నర్ పాలన విధించడం అన్నది అంత శ్రేయోదాయకం కాదు. దాన్ని పార్టీలు అంగీకరించవు.

మరి ఎప్పటికి తీరుతుంది మోడీ కోరిక. పైగా మోడీ కోరిక వెనుక అధికారసాధన పరమార్థం వుందనే అనుమానాలు వుండనే వున్నాయి. అందువల్ల అన్ని పార్టీలు దానికి సై అనడం కూడా అనవు. అందువల్ల ఎలా చూసుకున్నా,

ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశంలో జమిలి ఎన్నికల సాధ్యం కావడం కష్టమే.

కేసిఆర్ వ‌రాలు  బ‌ల‌మా ? బ‌ల‌హీన‌తా ?