జగన్ ఎందుకు తీసుకొచ్చారో? జాస్తి ఎందుకు వెళ్లిపోయారో?

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన నాటినుంచి.. సంక్షేమ పథకాలకు ఎంతగా ప్రాధాన్యం ఇచ్చి దూకుడుగా అమలు చేస్తున్నారో.. అంతే విపరీతంగా వివాదాల్లోనూ చిక్కుకుంటున్నారు.  Advertisement ప్రభుత్వపు చాలా నిర్ణయాలు న్యాయస్థానానికి వెళ్లడమూ..…

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన నాటినుంచి.. సంక్షేమ పథకాలకు ఎంతగా ప్రాధాన్యం ఇచ్చి దూకుడుగా అమలు చేస్తున్నారో.. అంతే విపరీతంగా వివాదాల్లోనూ చిక్కుకుంటున్నారు. 

ప్రభుత్వపు చాలా నిర్ణయాలు న్యాయస్థానానికి వెళ్లడమూ.. కొన్ని విషయాల్లో నిర్ణయాలపై వెనక్కి తగ్గవలసి రావడమూ జరిగింది. ఏది ఏమైనా న్యాయస్థానంలో ప్రభుత్వం వాదనను, ఆలోచనల్ని బలంగా వినిపించాల్సిన స్వరాల అవసరం ప్రభుత్వానికి పెరిగింది. అలాంటి నేపథ్యంలో.. ప్రభుత్వం తరఫున అనేక మంది సుప్రీం కోర్టు న్యాయవాదులను చాలా పెద్దపెద్ద ఫీజులు ఇచ్చి నియమించుకోవడం కూడా జరిగింది. ఆ క్రమంలో భాగంగానే.. ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది జాస్తి నాగభూషణ్ ను రాష్ట్ర ప్రభుత్వానికి అడిషనల్ ఏజీగా నియమించుకున్నారు. 

జాస్తి నాగభూషణ్ అంటే.. ఇటీవలి కాలంలోనే రిటైరైన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ కుమారుడు. ఆయనను ఏరికోరి జగన్ ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసులు వాదించడానికి అడిషనల్ ఏజీగా నియమించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతవరకు బాగానే ఉంది. అయితే సదరు జాస్తి నాగభూషణ్.. రెండు రోజుల కిందట తన బాధ్యతలనుంచి తప్పుకున్నట్టుగా, రాజీనామా చేసినట్టుగా వార్తలు వచ్చాయి. 

అమరావతి విషయంలో హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆ తీర్పు రాష్ట్ర ప్రభుత్వా ఆలోచనలకు భిన్నంగా ఉంది. ప్రభుత్వానికి అది చేదు తీర్పు. తీర్పు వచ్చిన రోజున సీఎం జగన్ ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. సజ్జల, మంత్రులతో పాటు న్యాయనిపుణులు అందులో పాల్గొన్నారు. ఏజీ శ్రీరామ్, అడిషనల్ ఏజీలు కూడా హాజరయ్యారు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత.. అడిషనల్ ఏజీ జాస్తి నాగభూషణ్ రాజీనామా చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు దారితీసిన కారణాలు మాత్రం వెలుగుచూడలేదు. 

ముఖ్యమంత్రి జగన్ అంతగా ఏరికోరి జాస్తి నాగభూషణ్ ను అడిషనల్ ఏజీగా ఎందుకు నియమించారో.. ఇన్నాళ్ల తర్వాత.. హఠాత్తుగా ఆయన ఎందుకు తన పదవికి రాజీనామా చేసేశారో ఏమీ అర్థం కాని సంగతి. 

అయితే నియామకాల విషయంలో జగన్ తీరు తొలినుంచి చాలా చాలా దూకుడుగానూ సాగుతూ వచ్చింది. సలహాదారుల హోదాతో లెక్కకు మిక్కిలిగా జగన్ బోలెడంత మందిని నియమించేశారు. అందరికీ లక్షల్లో జీతాలు.. ఆయా హోదాలకు తగ్గట్టుగా వైభవ సదుపాయాలు అన్నీ కల్పించారు. 

పదవీ హోదా జీతాలు అన్నీ ఉండేవి తప్ప వారికి పని ఉండేది కాదు. ఖాళీగా కూర్చోవడంలో విసుగెత్తి ఆ సలహాదారు పదవిని వదిలిపెట్టి వెళ్లిపోయిన వారున్నారు! లక్షల్లో సొమ్ములు పుచ్చుకునే బాధ్యతలను వదలి వెళ్లిపోవడానికి ఒక్కొక్కరికీ ఒక్కొక్క కారణాలు ఉంటాయి. మురి.. జాస్తి నాగభూషణ్ ఎందుకు వెళ్లిపోయారో అర్థంకాని సంగతి!