మరో జేసీ… అయ్యన్న…!

రాయలసీమలో ఒక జేసీ దివాకరరెడ్డి ఉన్నారు. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా నోరుకే బాగా పనిచెబుతారు. తనదైన శైలిలో మాటల దాడి చేస్తూ స్వపక్షాన్ని, విపక్షాన్ని కూడా…

రాయలసీమలో ఒక జేసీ దివాకరరెడ్డి ఉన్నారు. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా నోరుకే బాగా పనిచెబుతారు. తనదైన శైలిలో మాటల దాడి చేస్తూ స్వపక్షాన్ని, విపక్షాన్ని కూడా ఒక్క లెక్కన  ఆడేసుకుంటారు.

అటువంటి జేసీ టీడీపీ ఓడిపోయాక పోలీసులపైన పడ్డారు. వారిని అనరాని మాటలు అంటూ వచ్చారు. పక్కన చంద్రబాబు ఉన్నాడనో మరే వెర్రి ఆవేశమో తెలియదు కానీ ఈ మధ్న ఒక టీడీపీ సభలో పోలీసులను తమ బూట్లు నాకిస్తానని ఘాటైన కామెంట్స్ చేశారు. ఫలితంగా ఇపుడు పోలీస్ స్టేషన్లో గంటల కొద్దీ కూర్చోవాల్సివస్తోంది.

సీన్ కట్ చేస్తే విశాఖలో కూడా మరో జేసీ ఉన్నారు. ఆయన కూడా సీనియ‌ర్ నాయకుడే. ఆయన‌కు కూడా ఒళ్ళు తెలియని కోపమే. ఆయనే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు.  ఆయన సైతం ఇపుడు పోలీసులపైన తన నోరు పారేసుకుంటున్నారు. నా జోలికి వస్తే ఇంతే సంగతులు అంటూ గట్టి వార్నింగులే ఇస్తున్నారు.

అయ్యన్న ఇంట్లో రెండు జెండా వివాదం ఇపుడు ఉంది. స్వయంగా తమ్ముడే వైసీపీ జెండా  ఉమ్మడి ఇంటి మీద కట్టడంతో మోదలైన వివాదం కాస్తా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. తన ఇంటికి వచ్చిన పోలీసులపైన అయ్యన్న అనుచితమైన కామెంట్స్ చేసారంటూ పోలీసులు గత నెలలో  కేసు పెట్టారు.

దాని మీద బెయిల్ తెచ్చుకున్న అయ్యన్న మళ్ళీ అదే పోలీసులపైన తన వాచాలత్వం చూపిస్తున్నారు. నాతో పెట్టుకోమాకండి అంటున్నారు. నేను కనుక మూడవ కన్ను తెరిస్తే అంటూ తనదైన ఆవేశ కావేశాలను ప్రదర్శిస్తున్నారు.

మొత్తానికి విశాఖ జేసీ కూడా పోలీసులతోనే తలపడుతున్నారు. మరి ఈయన కూడా ఖాకీల విషయంలో గట్టిగానే ఉంటే సీనియర్ జేసీ మాదిరిగానే ఇబ్బందులు తప్పవేమోనని అనుచరులు భయపడుతున్నారు.

ఏది ఏమైనా అక్కడ  అధినేత చంద్రబాబు కూడా పోలీసులనే తగులుకుంటున్నారు. మొత్తానికి అధికారం అంటే లాఠీ అన్నది పదవి పోయాక పసుపు పార్టీకి బాగానే తెలిసివస్తోంది కాబోలు.