సినీ రంగంలో రాంగోపాల్ వర్మ , రాజకీయ రంగంలో జేసీ దివాకర్‌రెడ్డి…ఆయా రంగాల్లో వీరిద్దరిది ప్రత్యేక పాత్ర.సమకాలీన రాజకీయ,సామాజిక అంశాలపై తమదైన శైలిలో ఎప్పటికప్పుడు వారు స్పందిస్తుంటారు.వర్మ సినిమాలు తీస్తే,జేసీ టీవీల్లో సినిమాలు చూపుతుంటాడు.
అమరావతిలో బుధవారం ఆయన మాటలు సంచలనం రేకెత్తించాయి. ప్రస్తుత ప్రభుత్వానికి ‘రెడ్డిరాజ్యంలో కక్ష రాజ్యం’అని పేరు పెడితే బాగుంటుందని సూచించాడు.రాంగోపాల్‌వర్మ తీసిన కమ్మరాజ్యంలో కడప రెడ్లు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని పేరు మార్చుకుని రేపు విడుదలకు సిద్ధమైంది. అయితే సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ రాలేదని చెబుతున్న నేపథ్యంలో, ఆ సినిమా విడుదలయ్యే వరకు ఆందోళన తప్పదు.
ప్రస్తుతం వర్మ సినిమా వివాదం అయిన నేపథ్యంలో జగన్ సర్కార్ పాలనపై మాజీ ఎంపీ జేసీ సమయస్ఫూర్తితో రెడ్డిరాజ్యంలో కక్షరాజ్యం అని పేరు పెడితే బాగుంటుందని వ్యంగ్యంగా అన్నాడు.హాస్యచతురతకు పెట్టింది పేరైన జేసీ ఇంకా పలు అంశాలపై తనదైన శైలిలో స్పందించి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.
వైఎస్ జగన్ తన తాత రాజారెడ్డి మార్క్ పాలన సాగిస్తున్నాడని అన్నాడు. నామినేటెడ్ పోస్టుల్లో రెడ్లకు ప్రాధాన్యం ఇచ్చినందుకు జగన్‌ను అభినందించాడు. ఇదే చంద్రబాబు పాలనలో కమ్మలకు అన్యాయం జరిగిందని జేసీ సెలవిచ్చాడు. రాయలసీమ ప్రాజెక్టులపై జగన్ బాగా మాట్లాడారన్నాడు. అయితే ఆయన మాటలు ఆచరణకు నోచుకుంటే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్నాడు. నెల్లూరులో మాత్రమే మాఫియా ఉందని ఆనం మాట్లాడడం బాగాలేదని, అసలు అది లేనిదెక్కడో చెప్పాలని జేసీ ప్రశ్నించడం కొసమెరుపు.