మారు వేషం కట్టిన జాయింట్ కలెక్టర్ !

పూర్వకాలంలో రాజులు మంత్రులు మారు వేషాల్లో జనాల్లోకి వెళ్ళారని విన్నాం. ఇక పాత బ్లాక్ అండ్ వైత్ ఎన్టీయార్ సినిమాల్లో అన్నగారు మారు వేషాలలో వచ్చి  విలన్ల భరతం పట్టడం కూడా చూశాం. Advertisement…

పూర్వకాలంలో రాజులు మంత్రులు మారు వేషాల్లో జనాల్లోకి వెళ్ళారని విన్నాం. ఇక పాత బ్లాక్ అండ్ వైత్ ఎన్టీయార్ సినిమాల్లో అన్నగారు మారు వేషాలలో వచ్చి  విలన్ల భరతం పట్టడం కూడా చూశాం.

కానీ ఇపుడున్న సమాజంలో నిజాలు వెలికితీయాలంటే అసలు వేషం తీయాల్సిందేనని ఆలోచించే ఒక జాయింట్ కలెక్టర్ గారిని కళ్ళారా చూస్తున్నాం. విజయనగరం జిల్లా జేసీగా ఉన్న కిషోర్ కుమార్ కి రైతు బజార్లలో ధరలు ఎక్కువగా చెప్పి అమ్ముతున్నారని ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి.

అంతే క్షణం కూడా ఆలస్యం చేయకుండా  జాయింట్ కలెక్టర్ గారు అచ్చమైన పల్లెటూరు ఆసామిగా మారిపోయి రైతు బజార్లను విజిట్ చేశారు. అక్కడ బోర్డు మీద ఉన్న ధరలతో పోలిస్తే ఎక్కువ చెప్పి అమ్ముతున్న వారి వ్యాపారుల  వివరాలన్నీ సేకరించారు.

పని పూర్తయిన తరువాత తన అసలు వేషం చూపించేసరికి అక్రమాలు చేస్తున్న వ్యాపారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. బాబోయి ఇదేంటి సామీ అంటూ కాళ్ళ మీద పడ్డారు, ఇక వినియోగదారులు కూడా అధికారులు ఇలా వాస్తవాలు తెలుసుకుంటే తమకు మరింత మేలు జరుగుతుందని ఆ జేసీ గారికి తెగ పొగిడేశారు.

జగన్ సర్కార్ ఇలాంటి చిత్తశుధ్ధి కలిగిన అధికారులు ఉండడం ప్రభుత్వానికి కొండంత  అండ అని వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు కూడా సదరు జేసీ గారిని వేయి నోళ్ళ పొగుడుతున్నారిపుడు. ఏదేమైనా చేతల ప్రభుత్వం అంటే ఇలాగే  ఉంటుంది కదా.

నీ ఆస్థి ఐశ్వర్యం ఆంధ్ర ప్రజల బిక్ష అని మర్చిపోకు

దేవినేని ఉమని ఉతికి ఆరేసిన కొడాలి నాని