ఆ డమ్మీ పదవి.. రామ్మోహన్ నాయుడుకేనట!

ముగ్గురు ఎంపీలు కలిగి ఉన్న, ఒక రాష్ట్రంలో కేవలం ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లను కలిగి ఉన్నా.. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీనే! అని ఆ పార్టీ వాళ్లు అనుకుంటూ ఉంటారు. జనాలంతా అలాగే…

ముగ్గురు ఎంపీలు కలిగి ఉన్న, ఒక రాష్ట్రంలో కేవలం ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లను కలిగి ఉన్నా.. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీనే! అని ఆ పార్టీ వాళ్లు అనుకుంటూ ఉంటారు. జనాలంతా అలాగే అనుకోవాలని చెబుతూ ఉంటారు తెలుగుదేశం వాళ్లు.

ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాను ఎలాగో దక్కించుకున్న టీడీపీకి చంద్రబాబు నాయుడు జాతీయాధ్యక్షుడు! చెప్పుకుంటే అంతర్జాతీయ అధ్యక్షుడు కూడా ఆయనే! ఇలాంటి నేపథ్యంలో ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఒక అధ్యక్షుడు ఉంటూ వస్తున్నారు!

ఆ పదవిలో ఇన్నాళ్లూ కిమిడి కళా వెంకట్రావు కలిగి ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడుగా వ్యవహరించారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్.. నెరవేర్చిన కార్యాలన్నీ పోనూ, కళా వెంకట్రావుకు ఆ హోదా మాత్రమే మిగిలింది.

ఇప్పుడు ఆ హోదాను మరోనేతకు ఇవ్వనున్నారట. రామ్మోహన్ నాయుడుకు ఆ పదవిని కట్టబెట్టనున్నారట! ఎంత గొప్ప నిర్ణయమో! బీసీకి తెలుగుదేశం పార్టీ ఏపీ విభాగం అధ్యక్ష పదవిని ఇచ్చినట్టుగా చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఇలా చేస్తోందట.

అయినా అదొక డమ్మీ పదవి అనే విషయం అందరికీ తెలిసిపోయాకా, తెలుగుదేశం ఉనికే కొశ్చన్ మార్క్ అవుతున్న వేళ కూడా డ్రామాలకు మాత్రం కొదవలేనట్టుగా ఉందని పరిశీలకులు అంటున్నారు.

ప్రయత్నాలు ఆపని అఖిలప్రియ.. మరి జగన్ కరుణిస్తాడా?