వచ్చేనెల నాలుగు నుంచి ఆరు వరకూ జరగనున్న తానా సభలకు డైట్ మెజీషియన్ వీరమాచనేని రామకృష్ణ హాజరు కానున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన వెలువడింది. జూలై నాలుగు, ఐదు, ఆరు తేదీల్లో తానా నేషనల్ కాన్ఫరెన్స్ లో ఆయన అందుబాటులో ఉంటారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
వీఆర్కే డైట్ ప్రతిపాదన కర్త అయిన వీరమాచనేనితో మమేకం కావాలనుకునే ఎన్ఆర్ఐలకు ఇది మంచి అవకాశం. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు యూఎస్ వెళ్లనున్న వీరమాచనేని అక్కడ మరిన్ని సభలు, సమావేశాలకు కూడా అందుబాటులో ఉండనున్నారు.
తానా సమావేశాల్లో పాల్గొనడంతో పాటు, దాదాపు నెల రోజులకు పైనే తను అమెరికా, కెనడాల్లో డైట్ పై జరిగే సదస్సుల్లో పాల్గొనబోతున్నట్టుగా వీరమాచనేని తెలిపారు. ఇప్పటివరకూ కొంత షెడ్యూల్ ఫిక్స్ అయ్యిందని ఆయన వివరించారు.
ఈనెల 26న తను అమెరికా చేరబోతున్నట్టుగా, ఆగస్టు ఐదు వరకూ అక్కడే ఉండబోతున్నట్టుగా ఆయన తెలిపారు. ఇప్పటివరకూ కొన్ని సదస్సుల నిర్వహణకు షెడ్యూల్ ఫిక్స్ అయ్యిందని తెలిపారు. ఆగస్టు మూడోతేదీన హోస్టన్ లో, నాలుగో తేదీన డల్లాస్ లో సదస్సులు ఉంటాయన్నారు.
మిగిలిన తేదీల్లో కూడా అమెరికా వ్యాప్తంగా వివిధ నగరాల్లో సదస్సులు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం అవుతోందని, అందుకు సంబంధించి ఒక టీమ్ ఏర్పాట్లలో ఉందని వివరించారు. ఆగస్టు ఏడున దుబాయ్ లో మరో సదస్సు ఉందని తెలిపారు.
మిగిలిన వివరాలను షెడ్యూల్ అంతా ఖరారు అయ్యాకా చెబుతామన్నారు. వివరాల కోసం +1 571 509 8800 నంబర్ ను సంప్రదించవచ్చని వీరమాచనేని తెలిపారు.