డీకేశి అరెస్ట్.. బీజేపీ వాళ్లలో దడ!

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత డీకే శివకుమార అరెస్టుపై భారతీయ జనతా పార్టీలో భయం వ్యక్తం అవుతూ ఉంది. ఈ విషయం గురించి ఆ పార్టీ నేతలు ఘాటుగా స్పందించడం లేదు. డీకే మీద…

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత డీకే శివకుమార అరెస్టుపై భారతీయ జనతా పార్టీలో భయం వ్యక్తం అవుతూ ఉంది. ఈ విషయం గురించి ఆ పార్టీ నేతలు ఘాటుగా స్పందించడం లేదు. డీకే మీద వాళ్లు సానుభూతి వ్యక్తం చేసేస్తూ ఉన్నారు. ఎక్కడ మాటతూలితే ఏమవుతుందో అనే భయం వారిలో వ్యక్తం అవుతూ ఉంది. 

సాధారణంగా ఇలా తమ రాజకీయ ప్రత్యర్థి అరెస్టు అయితే అధికారంలో ఉన్నవాళ్లు ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాంటి సన్నివేశాలు తెలుగు వాళ్లు బాగా గమనించారు. అలా జైలుకు పంపించేస్తే కథ అయిపోయిందని అని ఇక్కడ అనుకున్నారు. అందుకోసం అక్రమ కేసులను బనాయించిన వైనాలు కూడా తెలిసిన సంగతే.

ఇప్పుడు డీకే శివకుమారను జైలుకు పంపించారు కానీ, బీజేపీ వాళ్లు విర్రవీగడం లేదు. ఆయన విచారణను ఎదుర్కొని క్లీన్ గా బయటకు రావాలని ఆకాంక్షిస్తున్నట్టుగా కర్ణాటక నేతలు అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసింది ఏ కాంగ్రెస్ వాళ్లో అయితే అదోలెక్క. ఈ మాటలను మాట్లాడింది కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, కర్ణాటక ఉపముఖ్యమంత్రి గోవింద్ కర్జోల్ తదితరులు.

డీకేశి మీద అపారమైన సానుభూతి వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఇప్పుడు మాటతూలితే ఒక సామాజికవర్గం ఓట్లు తమకు పూర్తిగా దూరం అవుతాయని బీజేపీవాళ్లు భయపడుతున్నారు. కర్ణాటకలో ప్రభావాత్మకమైన స్థాయిలో ఉండే వక్కలిగ సామాజికవర్గానికి చెందినవ్యక్తి డీకే శివకుమార. 

కర్ణాటక రాజకీయంలో గౌడలు పవర్ ఫుల్ గా ఉన్నారు. డీకేశి పేరు వెనుక గౌడ కనిపించకపోయినా, ఈయనా ఆ సామాజికవర్గానికే చెందిన వ్యక్తి. రామనగర ఏరియాలో దేవేగౌడ ఆధిపత్యానికి బ్రేక్ చేసిన వ్యక్తి డీకేశి. ఇక గత కొన్నేళ్లలో ఆయన కర్ణాటక రాజకీయాలను ఎంతగా ప్రభావితం చేశారో అందరికీ తెలిసిన సంగతే. ఇలాంటి నేపథ్యంలో డీకేశి అరెస్టు నేఫథ్యంలో వక్కలిగలు తమకు పూర్తిగా దూరం అవుతారని కర్ణాటక బీజేపీ భయపడుతోంది. అందుకే ఆయన మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నారు అక్కడి కమలనాథులు.

తెలుగులో సినీప్రియుల రూటు మారింది