కళ్యాణ్ సుంకరకు బెదిరింపులు?

ఓ మీడియా సంస్థ తీరుతెన్నులు ఎండగడుతూ సెటైరికల్ వీడియోలు చేస్తున్న న్యాయవాది కమ్ పొలిటికల్ యాక్టివిస్ట్ కళ్యాణ్ సుంకర కు ఫోన్ లో బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే స్వతహాగా న్యాయవాది కావడంతో ఈ…

ఓ మీడియా సంస్థ తీరుతెన్నులు ఎండగడుతూ సెటైరికల్ వీడియోలు చేస్తున్న న్యాయవాది కమ్ పొలిటికల్ యాక్టివిస్ట్ కళ్యాణ్ సుంకర కు ఫోన్ లో బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే స్వతహాగా న్యాయవాది కావడంతో ఈ బెదిరింపులు కాస్త స్మూత్ గా వుంటున్నాయని బోగట్టా.

'మాకూ టైమ్ వస్తుంది. మా టెర్మ్ వస్తుంది..అది గుర్తుంచుకోండి' అనే టైపులో ఫోన్ లో హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. 

అమెరికాలో తెలుగువారికి చెందిన ఓ సంస్థ సభ్యులు కూడా ఈ హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే పనిలో పనిగా సదరు మీడియా జనాలు కూడా ఎందుకిదంతా అని మెల్లగా నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారట. 

కళ్యాణ్ సుంకర ప్రతివారం నేరుగా అన్ని వ్యవహారాలు సెటైరికల్ ఇంటర్వ్యూల రూపంలో బట్టబయలు చేస్తున్నారు. ఇవన్నీ సోషల్ మీడియాలో కాస్త గట్టిగానే వైరల్ అవుతున్నాయి. 

వీటివల్ల ఓ పర్టిక్యులర్ మీడియా, ఆ మీడియా మద్దతు ఇచ్చే పార్టీ ఇరుకున పడేలా వుంది వ్యవహారం. బహుశా అందుకే ఈ హెచ్చరికలు కావచ్చు. కానీ కళ్యాణ్ సుంకర మాత్రం ఈ హెచ్చరికలను లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.