కర్ణాటక.. ఈ రోజు ఖాయంగానట..!

పక్షం రోజులుగా రచ్చ రచ్చగా సాగుతున్న కర్ణాటక రాజకీయానికి మంగళవారం ఖాయంగా క్లైమాక్స్ ఉంటుందట! ఈ రోజు అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు సంబంధించిన ఓటింగ్ ఉంటుందని సమాచారం. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ స్వయంగా…

పక్షం రోజులుగా రచ్చ రచ్చగా సాగుతున్న కర్ణాటక రాజకీయానికి మంగళవారం ఖాయంగా క్లైమాక్స్ ఉంటుందట! ఈ రోజు అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు సంబంధించిన ఓటింగ్ ఉంటుందని సమాచారం. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ స్వయంగా ప్రకటన చేశారు. ఇప్పటికే ఈ విషయంలో స్పీకర్ పై చాలా ఒత్తిడి ఉంది. ఈ వ్యవహారంపై గవర్నర్ పలుసార్లు స్పీకర్ కు ఆదేశాలు ఇచ్చారు. గడువులు పెట్టి అంతలోపు విశ్వాస పరీక్ష ఓటింగ్ జరగాలని గవర్నర్ ఆదేశించారు.

అయితే ఆ ఆదేశాలను స్పీకర్ పట్టించుకోలేదు. కానీ చివరకు స్పీకర్ రమేశ్ కుమార్ స్వయంగా ప్రకటన చేశారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు విశ్వాస పరీక్షపై ఓటింగ్ ఉంటుందని ఆయన ప్రకటించారు. అయితే కుమారస్వామి మాత్రం వాయిదానే కోరుతున్నట్టుగా తెలుస్తోంది.

విశ్వాస పరీక్షను వాయిదా పద్ధతిన మరి కొన్నిరోజులు నెట్టుకురావాలన్నట్టుగా కుమారస్వామి కోరుతున్నారట. అయితే ఇక వాయిదాలు వేస్తే తన పరువుపోతుందని రమేశ్ కుమార్ మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటింగ్ ఉంటుందని ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది.

ఓటింగ్ జరిగితే మాత్రం కుమారస్వామి సర్కారు పతనం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు ఇరవైమంది ఎమ్మెల్యేలు సంకీర్ణ సర్కారుకు దూరం అయ్యారని అంచనా. వారంతా ఓటింగ్ కు గైర్హాజరు అయితే కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు పడిపోవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో ఘోరంగా ఓటమి