ఓంఎసీ వ్యవహారంపై విచారణ జరుపుతూ గాలి జనార్ధన్ రెడ్డికి సంబంధించిన వెయ్యి కోట్ల రూపాయల పైస్థాయి ఆస్తులను ఈడీ కొన్నేళ్ల కింద జప్తు చేసింది. ఆ తర్వాత వ్యవహారంపై సుదీర్ఘ విచారణ కొనసాగుతూనే ఉంది. ఆ విచారణపై కొన్నాళ్ల కిందట కర్ణాటక హైకోర్టు స్పందించింది.
ఈడీ అటాచ్ చేసిన వెయ్యి కోట్ల రూపాయల పైస్థాయి ఆస్తులపై కోర్టు కీలకమైన తీర్పును ఇచ్చింది. ఆ ఆస్తుల అటాచ్ మెంట్ ను కోర్టు తప్పుపట్టింది. ఆ వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులను జనార్ధన్ రెడ్డికి తిరిగి అప్పగించాలని కోర్టు తీర్పును ఇచ్చింది.
ఏడాది కిందటే అందుకు సంబంధించిన తీర్పు వచ్చింది. అయితే ఇప్పటివరకూ ఈడీ తనకు ఆ ఆస్తులను తిరిగి ఇవ్వలేదని జనార్ధన్ రెడ్డి వాపోతున్నారు. తన ఆస్తులను తనకు అప్పగించమని కోర్టు ఆదేశించినా ఈడీ స్పందించడం లేదని ఆయన అన్నారు.
మరోసారి విచారణకు హాజరైన ఆయన ఈ విషయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ స్పందించకపోతే తను సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు.