Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కొరటాల.. ఎన్టీఆర్ నా? విజయ్ నా?

కొరటాల.. ఎన్టీఆర్ నా? విజయ్ నా?

అన్నీ అనుకున్నట్లు కుదిరితే మెగాస్టార్ చిరంజీవి సినిమా తరువాత దర్శకుడు కొరటాల శివ చేసే సినిమాలో నటించే అవకాశం వుందంటూ హీరో విజయ్ దేవరకొండ ఒక ఫీలర్ వదిలేసారు. మీడియా ఆయనను పూరి, కొరటాలతో సినిమాలు వున్నాయా అంటే విజయ్ ఇచ్చిన సమాధానాల్లో ఒకటి ఇది. రెండో సమాధానం కూడా వుంది. పూరితో సినిమా అన్న ఐడియా లేదు. వుంటే చెబుతాను అన్నది ఆ సమాధానం.

సరే, పూరితో సినిమా లేదు అన్న సమాధానం అందరికీ తెలిసిందే. పూరి అభిమానుల వైపు నుంచి పుట్టిన ప్యూర్ గ్యాసిప్ నే విజయ్-పూరి సినిమా అన్నది. అయితే కొరటాల సినిమా వ్యవహారం అలాంటిది కాదు. ఇటు కొరటాలకు, అటు విజయ్ కు ఇద్దరికీ పూర్తి ఆసక్తి వున్న వైనం అది.

ఇప్పుడు విజయ్ వైపు నుంచి క్లారిటీ వచ్చేసింది. ఇక కొరటాల వైపు నుంచే రావాలి. అయితే మెగాస్టార్ చిరంజీవితో సినిమా తరువాత కొరటాలశివ చేయబోయే సినిమా ఎన్టీఆర్ తోనే అన్న టాక్ వుంది. పైగా కొరటాల శివ పరుగెడుతూ సినిమాలు చేయరు. ఆయన ఓపిగ్గా స్క్రిప్ట్ స్వంతంగా తయారుచేసుకుని, అక్షరం.. అక్షరం చెక్కి, అప్పుడు సినిమా తీస్తారు.

అందువల్ల ఎన్టీఆర్ అభిమానులు అయినా, విజయ్ అభిమానులు, ఎవరో ఒకరు మాత్రం తమ హీరో కోసం కొరటాల తీసే సినిమా కోసం 2021 వరకు వేచి వుండాలేమో? 2020 సమ్మర్ కే మెగాస్టార్ చిరంజీవి సినిమా. ఆ తరువాతనే ఎన్టీఆర్ అయినా, విజయ్ అయినా, 

పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో ఘోరంగా ఓటమి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?