KCR చెప్పింది చట్టం కాదు, పార్లమెంట్ చేసింది చట్టం

విభజన చట్టం తాత్కాలికం కాదు. విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాలను ఏపీ , తెలంగాణ కు 512 – 299 TMC లు హక్కుగా ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం తమకు అన్యాయం జరిగిందని…

విభజన చట్టం తాత్కాలికం కాదు. విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాలను ఏపీ , తెలంగాణ కు 512 – 299 TMC లు హక్కుగా ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం తమకు అన్యాయం జరిగిందని న్యాయ పోరాటం చేస్తుంది. వారి పోరాట హక్కును కాదనలేము. కానీ వారి కోరిక మేరకు వాటాలో మార్పులు జరిగే వరకు ఇప్పుడు ఉన్న చట్టం అమలులో ఉంటుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం తాము పోరాడుతున్నాము కనుక అమలులో ఉన్న కేటాయింపులు తాత్కాలికం అని తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పక తప్పదు.

అసలు తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నట్లు కేటాయింపులలో మార్పులు సాధ్యమా ? కృష్ణా జలాల వినియోగంపై బ్రిశేష్ కుమార్ ట్రిబ్యునల్ అమలులో ఉన్నది. నాలుగు రాష్ట్రాల కృష్ణా జలాల సమస్య పై కేవలం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపకాలలో మార్పులు పరిమితం చేయడం చట్ట విరుద్ధం. 

సుప్రీంకోర్టులో ఫిటీషన్ వేసిన తెలంగాణ ప్రభుత్వం కేంద్రం తాము ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటే ఫిటీషన్ ఉపసంహరణ చేయాలని సలహా ఇచ్చింది. వాస్తవానికి ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడాన్ని ఏపీ అప్పుడే అభ్యంతరం వ్యక్తం చేసి ఉండాలి. ఈ విషయంలో కేంద్రం ప్రత్యేక కమిషన్ వేస్తే ఏపీ అభ్యంతరం తెలుపుతుంది. 

కమిషన్ వేస్తే దీని ఆధారంగా కావేరి పై కర్ణాటక ఇదే విధంగా మాకు జరగాలని కోర్టుకు వెళుతుంది. కమిషన్ వేయడం ఒక సమస్య అయితే  ఇదే వరకే నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకు నష్టం జరగకుండా నూతన కేటాయింపులు ఉండాలన్నది నిబంధన. మరి తెలంగాణ కోరుతున్నట్లు ఏపీకి ప్రాజెక్టుల వారిగా అమలులో ఉన్న కేటాయింపులను కొత్త కమిషన్ ఎలా మార్పు చేస్తుంది.

అన్నీ తెలిసికూడా దక్షిణ తెలంగాణకు  అన్యాయం చేసి తప్పించుకోవడానికి రాయలసీమ ప్రాజెక్టులను అక్రమ ప్రాజెక్టులు అంటూ తాము అదనంగా నీటిని తెలంగాణకు సాధించ బోతున్నట్లు తెలంగాణ ప్రజలకు అసత్యాలు చెపుతున్నారు ముఖ్యమంత్రి KCR వారు గుర్తుంచుకోవాలసింది వారు చెప్పింది చట్టం కాదు పార్లమెంట్ చేసింది చట్టమని.

-మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి. రాయలసీమ మేధావుల ఫోరం. 9490493436