హుజూర్ నగర్ లో కేసీఆర్ సభ రద్దు.. అసలు కథేంటి?

తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ప్రచారం కోసం రంగంలోకి దిగాల్సిన వేళ వర్షం అడ్డంకిగా మారింది. మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తూ ఉండటంతో…

తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ప్రచారం కోసం రంగంలోకి దిగాల్సిన వేళ వర్షం అడ్డంకిగా మారింది. మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తూ ఉండటంతో హెలీకాప్టర్ ల్యాండింగ్ కు అనుకూల పరిస్థితి లేదని అధికారులు తేల్చారు. భారీ వర్షంతో సభ కూడా సాగడం సాధ్యంకాదని పార్టీ కూడా తేల్చింది. ఈ నేపథ్యంలో ఆ సభను రద్దు చేసినట్టుగా ప్రకటించారు!

అధికార పార్టీకి దాదాపుగా ఇది ప్రతిష్టాత్మకమైన ఉపఎన్నిక. ఇలాంటి నేపథ్యంలో తీరా సీఎం కేసీఆర్ ప్రచారానికి రంగంలోకి దిగిన సమయంలో ప్రచార సభ రద్దుకావడం గమనార్హం. ఇది అధికార పార్టీకి ఇబ్బందికరమే. కేసీఆర్ సభకు హాజరు అయ్యేందుకు వచ్చిన కార్యకర్తలు కూడా నిరాశగా వెనుదిరిగారట. అలాగే ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది సర్వత్రా ఆసక్తి రేపిన అంశం. ఒకవైపు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు.

ఇలాంటి నేపథ్యంలో ఉప ఎన్నికల ప్రచార వేదిక నుంచి ఆయన ఏం మాట్లాడతారు, ఆ అంశం గురించి ఏం స్పందిస్తారు? అనేది చర్చనీయాంశంగా నిలిచింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రచార సభ అనూహ్యంగా రద్దు అయ్యింది! మరి కేసీఆర్ ఇంతకీ ఈ ప్రచారంలో పాల్గొనబోతున్నారా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది!

నీ తెలుగు కంటే నేనే మేలు.. హాట్ యాంకర్ డైరెక్టర్ చిట్ చాట్