హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్?

ఇప్పటికే చెన్నై మరోసారి లాక్ డౌన్ లోకి వెళ్లింది. అటు ఏపీలో కూడా కొన్ని పట్టణాల్లో లాక్ డౌన్ నడుస్తోంది. ఇప్పుడు తెలంగాణలోని కీలకమైన హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ పడే సూచనలు…

ఇప్పటికే చెన్నై మరోసారి లాక్ డౌన్ లోకి వెళ్లింది. అటు ఏపీలో కూడా కొన్ని పట్టణాల్లో లాక్ డౌన్ నడుస్తోంది. ఇప్పుడు తెలంగాణలోని కీలకమైన హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. అవును.. పరిస్థితి చేయిదాటే లోపే భాగ్యనగరంలో మరోసారి లాక్ డౌన్ విధిస్తే మంచిదనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది.

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, వైరస్ బాధితులకు చికిత్స లాంటి అంశాలపై ప్రగతి భవన్ లో  ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి.. ఈ మేరకు లాక్ డౌన్ పై స్పందించారు. మరో 2-3 రోజుల్లో కేబినెట్ సమావేశం ఏర్పాటుచేసి హైదరాబాద్ లో లాక్ డౌన్ విధించడంపై తుది నిర్ణయం తీసుకుంటామని కూడా స్పష్టంచేశారు.

జీహెచ్ఎంసీ పరిథిలో మరోసారి లాక్ డౌన్ విధిస్తే మంచిదని ఇప్పటికే వైద్యారోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కుదిరితే రంగారెడ్డి, మేడ్చల్ పరిథిలో కూడా లాక్ డౌన్ ను మరోసారి అమలుచేయాలని అందులో సూచించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ఇంతకుమించి మరో ప్రత్యామ్నాయం లేదని కూడా సూచించింది. ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదికపై కేబినెట్ భేటీలో కేసీఆర్ చర్చించనున్నారు.

మరోవైపు తెలంగాణలో గడిచిన 10 రోజులుగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న కొత్త‌గా 1087 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. ఆరుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 13,436కు చేరగా.. మొత్తం మృతుల సంఖ్య 243కు చేరుకుంది. అత్యథిక మరణాలు గ్రేటర్ పరిథిలోనే చోటుచేసుకుంటున్నాయి.

అల.. వైకుంఠపురంలో చూసి మైండ్ పోయింది

జగన్ గారిని ఫాలో అవ్వక తప్పదు