కవర్ ఆర్డర్ చేస్తే, ఏకంగా పాస్ పోర్ట్ వచ్చింది

ఆన్ లైన్ డెలివరీస్ లో జరిగే వింతలు అన్నీ ఇన్నీ కావు. అందులో జరిగే మోసాలు కూడా ఎప్పటికప్పుడు చూస్తున్నాం. మొన్నటికిమొన్న ఓ వ్యక్తి ఐఫోన్ ఆర్డర్ చేస్తే, అందులో ఓ సబ్బు, 5…

ఆన్ లైన్ డెలివరీస్ లో జరిగే వింతలు అన్నీ ఇన్నీ కావు. అందులో జరిగే మోసాలు కూడా ఎప్పటికప్పుడు చూస్తున్నాం. మొన్నటికిమొన్న ఓ వ్యక్తి ఐఫోన్ ఆర్డర్ చేస్తే, అందులో ఓ సబ్బు, 5 రూపాయల కాయిన్ వచ్చింది. అంతకంటే ముందు మరో వ్యక్తి ఐఫోన్ ఆర్డన్ చేస్తే అందులో 2 ఆపిల్స్ వచ్చిన ఘటన చూశాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అంతకుమించి.

కేరళకు చెందిన ఓ వ్యక్తి తన పాస్ పోర్ట్ ను భద్రపరచుకోవాలనుకున్నాడు. దీని కోసం అమెజాన్ లో ఓ కవర్ ఆర్డర్ చేశాడు. కొన్ని రోజులకు తను ఆర్డర్ చేసిన పాస్ పోర్ట్ కవరు అందుకున్నాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ కవర్ తో పాటు ఏకంగా ఒరిజినల్ పాస్ పోర్ట్ కూడా వచ్చేసింది. అంటే.. కవర్ ఆర్డర్ చేస్తే కవర్ తో పాటు పాస్ పోర్ట్ కూడా వచ్చిందన్నమాట.

ఇంతకీ ఏం జరిగింది..?

అదే రాష్ట్రానికి చెందిన మహమూద్ సాహిల్ అనే వ్యక్తి గతంలో పాస్ పోర్ట్ కవర్ ఆర్డర్ చేశాడు. వచ్చిన తర్వాత అందులో తన పాస్ పోర్ట్ పెట్టి భద్రపరుచుకున్నాడు. కానీ ఆ తర్వాత 2 రోజులకు ఎందుకో అతడికి ఆ కవర్ నచ్చలేదు. అమెజాన్ లో రిటర్న్ రిక్వెస్ట్ పెట్టాడు. ఇంటికి ఏజెంజ్ వస్తే అతడికి కవర్ ఇచ్చేశాడు. కానీ అందులోంచి తన పాస్ పోర్ట్ తీసుకోవడం మరిచిపోయాడు.

అలా కవర్ మళ్లీ సెల్లర్ దగ్గరకు వెళ్లిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు మిధున్ అనే వ్యక్తి కవర్ ఆర్డర్ పెట్టడం, అతడికి కవర్ తో పాటు సాహిల్ పాస్ పోర్ట్ వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. సెల్లర్ డెలివరీ చేసే ముందు కవర్ ను చెక్ చేయకపోవడం వల్ల ఈ తప్పిదం జరిగింది. మిధున్ ఆ పాస్ పోర్ట్ ను తనకు దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు.