తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై, విభజన సమస్యలకు పరిష్కారం వెతికేందుకు ప్రయత్నిస్తోంటే టీడీపీ ఎంపీ కేశినేని నానికి అస్సలేమాత్రం నచ్చడంలేదు. అమరావతిని కూల్చేసి, హైద్రాబాద్‌ని అభివృద్ది చేసేందుకు వైఎస్ జగన్, కేసీఆర్‌తో చేతులు కలుపుతున్నారంటూ కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు నవ్వుల పాలవుతున్నాయి. వైఎస్ జగన్ ఇప్పుడు కేసీఆర్‌తో ముఖ్యమంత్రి హోదాలో మంతనాలు జరుపుతున్నారు. కానీ, కేసీఆర్‌తో మంతనాల కోసం చంద్రబాబు పడ్డ పాట్లు ఎవరికి తెలియవు.? కేసీఆర్‌తో పలుమార్లు చర్చలు కూడా జరిపారు చంద్రబాబు. అయితే, ఆ చర్చలు ముందుకు కదల్లేదనుకోండి.. అది వేరే విషయం.
పైకి నవ్వుతూ, వెనకాల వెన్నుపోటు రాజకీయాలు నడిపే చంద్రబాబుని కేసీఆర్ కావాలనే దూరం పెట్టేశారు. ఓటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిపోయి, చంద్రబాబు విజయవాడకు జంప్ చేశారుగానీ.. లేదంటే, ఆయన బాధ్యతగల ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఆలోచించేవారా.? అయినా, కేసీఆర్ – చంద్రబాబు గతంలో చర్చలు జరిపినప్పుడు ఇదే కేశినేని నాని ఎంపీగా వున్నారు.. మరి, అప్పుడెందుకు ఆ భేటీని ప్రశ్నించలేదట.? పైగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేసేందుకు చంద్రబాబు పడ్డపాట్లు అన్నీ ఇన్నీకావు. ఇదంతా కేశినేని నానికి తెలియదని ఎలా అనుకోగలం.?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శాశ్వత భవనాలు కట్టేందుకు సమయం పడుతుంది కాబట్టి.. అనే ఒక్క కుంటి సాకుచూపి, తన నివాసానికి పక్కనే, దాదాపు 9 కోట్ల వ్యయంతో ప్రజా వేదికను నిర్మించుకున్నారు చంద్రబాబు. ప్రజల సొమ్ము మంచి నీళ్ళలా ఖర్చు చేసిన చంద్రబాబు, ఆ మొత్తాన్ని శాశ్వత భవనం కోసం ఇంకో చోట వెచ్చించి వుంటే బావుండేది కదా.! అంతా తాత్కాలికమే.. సింగపూర్ విమానాలు కూడా అంతే. రాజధాని రైతుల్ని సింగపూర్‌కి పంపిస్తామంటూ పబ్లిసిటీ స్టంట్లు చేసి.. సింగపూర్‌కి విమానాల్ని నడిపిన ఘనుడు చంద్రబాబు.
పౌర విమానయాన శాఖ మంత్రిగా తమ పార్టీ ఎంపీకి అవకాశం దక్కినా.. రాష్ట్రంలో విమానాశ్రయాల్ని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయలేని చంద్రబాబుని కేశినేని నాని ఎలా వెనకేసుకురాగలుగుతున్నారో ఏమో.! నిన్నగాక మొన్న, చంద్రబాబుపైనా, టీడీపీపైనా విమర్శలు చేస్తూ ఆ పార్టీ నుంచి బయటకొచ్చేందుకు ప్రయత్నించిన కేశినేని నాని అనూహ్యంగా మనసు మార్చుకుని.. ఇప్పుడు చంద్రబాబు భజనలో మునిగి తేలుతుండడం ఆశ్చర్యకరమే మరి.
సమ్మర్‌కి బంపర్ బిగినింగ్! హడలెత్తించిన మార్చి! ఆల్‌టైమ్ డిజాస్టర్!