కొత్త హీరోలు.. డబ్బులు వచ్చేయాలంటే ఎలా?

ఫస్ట్ మూవీకే రికార్డులు సృష్టించాలని ఎవరైనా ఆశిస్తారా? అలాగే మొదటి సినిమాకే ఫుల్లుగా బిజినెస్ అయిపోవాలని కోరుకోవడం కూడా అత్యాశే అవుతుంది. కానీ ఓ రెండు బ్యానర్లు మాత్రం ఈ దిశగా ఆలోచించడం లేదు.…

ఫస్ట్ మూవీకే రికార్డులు సృష్టించాలని ఎవరైనా ఆశిస్తారా? అలాగే మొదటి సినిమాకే ఫుల్లుగా బిజినెస్ అయిపోవాలని కోరుకోవడం కూడా అత్యాశే అవుతుంది. కానీ ఓ రెండు బ్యానర్లు మాత్రం ఈ దిశగా ఆలోచించడం లేదు. తామేదో సూపర్ హిట్ కాంబినేషన్ ను తెరపైకి తెస్తున్నామని, ఓ సూపర్ స్టార్ ను పరిచయం చేస్తున్నామనే ఫీలింగ్ లో ఉన్నాయి. కొత్త హీరోలతో సినిమాలు చేస్తూ బిజినెస్ లో మాత్రం అందరికీ చుక్కలు చూపిస్తున్నారు.

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమౌతున్న సినిమా దొరసాని. ఇదే సినిమాతో రాజశేఖర్ చిన్నకూతురు కూడా హీరోయిన్ గా పరిచయం అవుతుంది. వీళ్లిద్దరూ స్టార్ మెటీరియల్ కాబట్టి దొరసానికి జనాలు పోటెత్తుతారని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. అందుకే బయ్యర్లు భారీ రేట్లు చెబుతున్నారు. అటు శాటిలైట్ రైట్స్ కింద కూడా భారీ మొత్తాలు చెబుతున్నారు.

మరోవైపు సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమౌతున్న ఉప్పెన సినిమా పరిస్థితి కూడా ఇలానే ఉంది. మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కూడా భారీ రేట్లు చెబుతున్నారు. ఇటు థియేట్రికల్, అటు శాటిలైట్ రెండు విభాగాల్లోనూ చుక్కలు చూపిస్తున్నారట.

నిజానికి హీరోలు కొత్త అయినప్పటికీ, మంచి దర్శకుల చేతిలో పడితే నిర్మాతలు ఆశించే మొత్తాలు వచ్చి ఉండేవి. కానీ దొరసాని, ఉప్పెన సినిమాలకు స్టార్ డైరక్టర్లు వర్క్ చేయడంలేదు. అలాంటప్పుడు ఏం ఊహించుకొని ఇంత భారీ రేట్లు చెబుతున్నారో ఎవరికీ అర్థంకావడం లేదు. 

సమ్మర్‌కి బంపర్‌ బిగినింగ్‌! హడలెత్తించిన మార్చి! ఆల్‌టైమ్‌ డిజాస్టర్‌!