ఇలా కూడా రైతుల్ని ముంచేశావా బాబూ!

ఇన్నాళ్లూ రాజధాని కోసం మాత్రం రైతుల వద్ద నుంచి చంద్రబాబు భూమి తీసుకున్నారని (మరికొందరు లాక్కున్నారని ఆరోపిస్తారు) అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఓ కొత్త యాంగిల్ బయటపడింది. కేవలం కోర్ కాపిటల్ అభివృద్ధి…

ఇన్నాళ్లూ రాజధాని కోసం మాత్రం రైతుల వద్ద నుంచి చంద్రబాబు భూమి తీసుకున్నారని (మరికొందరు లాక్కున్నారని ఆరోపిస్తారు) అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఓ కొత్త యాంగిల్ బయటపడింది. కేవలం కోర్ కాపిటల్ అభివృద్ధి కోసం మాత్రమే కాదు.. కరకట్టపై నిర్మించిన ఆక్రమ నిర్మాణాల కోసం కూడా రైతుల వద్ద నుంచి భూమి లాక్కున్నారు చంద్రబాబు. ప్రజావేదిక కూల్చివేత సందర్భంగా ఈ విషయం బయటపడింది. ఈ విషయంలో మీడియాను కూడా తప్పుదోవ పట్టించిన వైనం బయటపడింది.

ప్రజావేదిక నిర్మాణం అక్రమం అనే విషయం తెలుస్తూనే ఉంది. అయితే ఈ అక్రమ నిర్మాణం కోసం సక్రమంగా ఉన్న రైతుల భూముల్ని లాక్కున్నారు అప్పట్లో. ఎందుకంటే, ఈ ప్రజావేదికను దాటుకొనే చంద్రబాబు తన నివాసానికి వెళ్లాలి. అలా వెళ్లాలంటే రైతుల భూములు కావాలి. అందుకే కేవలం చంద్రబాబు ఇంటికి వేయాల్సిన రోడ్డు కోసం రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఈ విషయం మీడియాకు కూడా పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ప్రజావేదిక కూల్చివేత నుంచే ఈ అక్రమనిర్మాణాల భరతం పట్టడం స్టార్ట్ చేశారు ముఖ్యమంత్రి. సీఎం నిర్ణయంతో ప్రజావేదికను నేలమట్టం చేసిన అధికారులు.. దానికి సంబంధించిన రోడ్డును కూడా స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. సరిగ్గా అదే టైమ్ లో రైతుల నుంచి భూములు తీసుకున్న విషయం బయటకొచ్చింది.

ప్రజావేదిక, చంద్రబాబు నివాసం కోసం వేసిన రోడ్డు తన సాగుభూమి అంటూ రైతులు ముందుకొచ్చారు. చంద్రబాబు తన నివాసం ఖాళీ చేసినప్పుడు ఆ భూమిని తిరిగి ఇచ్చేస్తామంటూ అప్పట్లో తహశీల్దారు తమకు లేఖలు ఇచ్చారని చెబుతున్నారు. కాబట్టి ఆ భూమిని తిరిగి మళ్లీ తమకి ఇచ్చేయాలని రైతులు కోరుకున్నారు.

ప్రస్తుతం ఈ విషయాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తనదైన శైలిలో పరిష్కరించడానికి ముందుకొచ్చారు. ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వం వద్ద నుంచి దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకోవడం ఆర్కేకు పెద్ద పని కాదు. ఈ అంశాన్ని పూర్తిగా అధ్యయనం చేసి రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని జగన్ ను కోరబోతున్నారు ఆర్కే.

సమ్మర్‌కి బంపర్‌ బిగినింగ్‌! హడలెత్తించిన మార్చి! ఆల్‌టైమ్‌ డిజాస్టర్‌!