‘కియా’కూ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి సంబంధం ఏంటంటే!

ఎవరో లేఖ రాశారనే విషయాన్ని, తెలుగుదేశం పార్టీ ఎద్దేవాలను కాసేపు పక్కనపెట్టి, పచ్చకళ్లద్దాలు పెట్టుకున్నవాళ్లు తమ మెదళ్లను కొంచెంవాడితే.. 'కియా' పరిశ్రమ ఏర్పడటానికి సంబంధించి ఒక ఉపోద్ఘాతాన్ని చెప్పాలి. అందుకోసం ముందుగా అనంతపురం జిల్లాలో…

ఎవరో లేఖ రాశారనే విషయాన్ని, తెలుగుదేశం పార్టీ ఎద్దేవాలను కాసేపు పక్కనపెట్టి, పచ్చకళ్లద్దాలు పెట్టుకున్నవాళ్లు తమ మెదళ్లను కొంచెంవాడితే.. 'కియా' పరిశ్రమ ఏర్పడటానికి సంబంధించి ఒక ఉపోద్ఘాతాన్ని చెప్పాలి. అందుకోసం ముందుగా అనంతపురం జిల్లాలో పెనుకొండ సమీపంలో కియా పరిశ్రమ ఏర్పాటు అయిన చోట పరిస్థితుల గురించి వివరించాలి. అదంతా మెట్ట భూమి. వ్యవసాయం జరుగుతుంది. చుట్టూ కొండలు, గుట్టలు. కియాకు సమీపంలో ఉన్న ఊరి పేరే 'గుట్టూరు'. అలా గుట్టల మధ్యన ఉండే ఆ ప్రాంతానికి ముందు సమీపంలో నేషనల్‌ హైవే సెవెన్‌ ఉంది.

ఆ హైవే పక్కనే కియా ప్లాంట్‌ను నెలకొల్పారు. ఏదైనా పరిశ్రమ ఒకచోట ఏర్పాడలాంటే.. ముందుగా అక్కడ కొన్ని వనరులు ఉండాలి. ఆ వనరుల్లో అత్యంత ముఖ్యమైనది నీరు! తాగునీటికి, ఆ పరిశ్రమ అవసరాలకు నీళ్లు పుష్కలంగా ఉన్నచోట మాత్రమే ఏ ఇండస్ట్రీ అయినా ఏర్పడుతుంది. గుట్టూరు ప్రాంతంలో నీటి వనరుల గురించి చెప్పాలంటే.. సగటు రాయలసీమ ప్రాంతం. వందల అడుగులు బోర్లు వేసినా నీళ్లుపడటం, పడకపోవడం దైవాధీనం. వర్షపాతం కూడా చాలా సాధారణ స్థితిలోనే ఉంటుంది. అలాంటిచోట ఒక పరిశ్రమ ఏర్పడటమే విచిత్రం!

ఆ ప్రాంతానికి అలాంటి పరిశ్రమ వస్తుందని ఎవరూ అనుకోలేదు. ఎవరైనా అనుకున్నా.. అక్కడ నీటి వనరులు లేవనే లాజిక్‌తో కామ్‌ అయిపోవాల్సిందే. మరి నీటి వనరులు ఏమాత్రం లేనిచోట కియా పరిశ్రమ ఎలా ఏర్పాటు అయ్యింది? రాయలసీమలోని సగటు వర్షపాతం మాత్రమే నమోదు అయ్యే చోటకు పరిశ్రమ ఎలా వచ్చింది? దానివెనుక మోడీ ఉన్నారా, చంద్రబాబు ఉన్నారా? అనేవాదన కన్నా ముందు వైఎస్‌నే గుర్తుచేయాలి.

ఎందుకంటే.. కియా పరిశ్రమ అక్కడ ఏర్పాటు కావడానికి ప్రధానమైన వనరు హంద్రీనీవా ప్రాజెక్టు! ఇప్పుడు కియా పరిశ్రమ ఉన్న ప్రాంతానికి కూత వేటు దూరంలోనే హంద్రీనీవా ప్రాజెక్టులో భాగమైన గొల్లపల్లి రిజర్వాయర్‌ ఉంటుంది. ఆ రిజర్వాయరే కియా పరిశ్రమకు నీటి వనరు. ఆ రిజర్వాయర్‌ నుంచి కియాకు ప్రత్యేకంగా భారీ పైప్‌లైన్‌ ఏర్పాటు చేశారు.

ఒకవేళ ఆ రిజర్వాయర్‌ నిర్మాణం అప్పటికి పూర్తికాకపోయి ఉంటే కియా అక్కడ ఏర్పాటు అయ్యేదేకాదు. 'హంద్రీనీవా' ప్రాజెక్టు వైఎస్‌ మానసపుత్రిక. ఈ విషయాన్ని ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని దగ్గరుండి చూసిన రైతులను అడిగితే చెబుతారు. హంధ్రీనీవాకు నీళ్లు వదిలినట్టుగా దాన్ని తనే కట్టినట్టుగా చెప్పుకొంటూ చంద్రబాబు నాయుడు ఎన్ని హరతులు ఇచ్చినా రైతులు తెలుగుదేశానికి ఓటు కూడా వేయలేదు! హంద్రీనీవా పరివాహక ప్రాంతం అంతా టీడీపీ చిత్తు చిత్తు అయ్యింది!

అదీకథ. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగమైన గొల్లపల్లి రిజర్వాయర్‌ ఆ సమయానికి నిర్మాణాన్ని పూర్తి చేసుకోకపోతే అక్కడ కియా ఊసేలేదు! ఆ రిజర్వాయర్‌ నిర్మాణం 80 శాతానికిపైగా వైఎస్‌ హయాంలో జరిగింది. ఆఖరికి మోటర్లు కూడా వైఎస్‌ హయాంలోనే అక్కడకు చేరుకున్నాయి. ఈ రకంగా చూస్తే.. కియా క్రిడెట్‌ ఎవరితో అర్థం చేసుకోవచ్చు. పచ్చబ్యాచ్‌ ఇలాంటి విషయాలను ఒప్పుకోలేదు. అయితే వాస్తవాలు ప్రజలకు తెలుసు. అందుకు చంద్రబాబు హారతులు ఇచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనం!

జగన్‌ మొహంలో చిరునవ్వు మార్పు కనబడుతోంది