రామోజీరావుకి సంతోషాన్నిచ్చిన కొడాలి నాని..!

సహజంగా రామోజీరావు తన ప్రియా పచ్చళ్ల వ్యాపారానికి సొంత సంస్థ ఈనాడులోనే పెద్దగా అడ్వర్టైజ్ మెంట్లు ఇవ్వరు. అలాంటిది ఏకంగా ఏపీ మంత్రి కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రియా పచ్చళ్లను…

సహజంగా రామోజీరావు తన ప్రియా పచ్చళ్ల వ్యాపారానికి సొంత సంస్థ ఈనాడులోనే పెద్దగా అడ్వర్టైజ్ మెంట్లు ఇవ్వరు. అలాంటిది ఏకంగా ఏపీ మంత్రి కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రియా పచ్చళ్లను తన ముందుంచుకుని మాట్లాడారు. పద్ధతిగా తిట్టినా.. ప్రియా పచ్చళ్లకు అంతకు మించిన పబ్లిసిటీ ఏం కావాలి..? అదే అక్కడ అనుకోకుండా రామోజీ రావుకి వరంలా మారింది.

కాంపిటీషన్లో కరుణించిన నాని..

ప్రస్తుతం ఏపీలో ఫుడ్ ప్రోడక్ట్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. అందులోనూ కొత్త కొత్త కంపెనీలు బాగానే మార్కెట్లోకి వస్తున్నాయి. సినీ హీరోయిన్లను సైతం బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుని కాంపిటీషన్లో దూసుకెళ్తున్నాయి కంపెనీలు. ఈ క్రమంలో ప్రియా పచ్చళ్లను దాదాపుగా చాలామంది మరచిపోయారు. 

కొత్త రుచులకు అలవాటు పడనివారు మాత్రమే.. ప్రియా వైపు చూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో రామోజీ రావుకి అనుకోని పబ్లిసిటీ ఇచ్చారు కొడాలి నాని. ప్రియా పచ్చడి బాటిళ్లను ఏకంగా ప్రెస్ మీట్ లో చూపించి మరీ హైలెట్ చేశారు.

బ్యాన్ బ్యాన్ బ్యాన్..

ఆ మీడియాని, ఆ ఛానెళ్లని నిషేధించండి అంటూ టీడీపీ ప్రకటన విడుదల చేసిన మరుసటి రోజే.. కొడాలి నాని, ఈనాడు ఆంధ్రజ్యోతి సహా.. ఇతర ఎల్లో మీడియాని నిషేధిస్తున్నట్టు తేల్చి చెప్పారు. ఇది టిట్ ఫర్ టాట్ అనుకున్నా కూడా.. ప్రభుత్వ వ్యతిరేక మీడియాకే ఎప్పుడూ ప్రజల్లో క్రేజ్ ఉంటుంది. సహజంగా ప్రభుత్వం గురించి ఆహా ఓహో అని రాసుకుంటే జనాలకి నచ్చదు, ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపితేనే జనానికి ఆసక్తి ఉంటుంది.

అయితే ఇక్కడ బాబు మీడియా నక్కలు బొక్కలు వెదుకుతున్నట్టు తయారవుతోంది. ప్రతిపక్షం ప్రతి పనికీ అడ్డు తగులుతున్నట్టే.. ప్రతిపక్ష అనుకూల మీడియా ప్రతి పనిలోనూ లోపాల్ని వెదుకుతోంది. అయితే మీడియాని ఇలా టార్గెట్ చేస్తే వారికి మరింత పబ్లిసిటీ ఇచ్చినట్టే లెక్క. అనుకోకుండా అలాంటి పనే చేశారు మంత్రి కొడాలి నాని, ప్రియా పచ్చళ్లకు, హెరిటేజ్ ఔట్ లెట్స్ కి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారు. అక్కడ దొరికే వస్తువుల రేట్లను కూడా చదివి జనాలకి వినిపించారు.