కొత్త విజిటింగ్ కార్డులోచ్చాయ్

తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేయలేకపోయినది, వైకాపా నేత జగన్ చేసింది అదే. నామినేటెడ్ పోస్టులు ధైర్యంగా భర్తీ చేయడం. పార్టీ జనాలు ఎప్పుడూ ఏదో ఒక పదవి కోసమే చూస్తుంటారు.  Advertisement అది చిన్నదా?…

తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేయలేకపోయినది, వైకాపా నేత జగన్ చేసింది అదే. నామినేటెడ్ పోస్టులు ధైర్యంగా భర్తీ చేయడం. పార్టీ జనాలు ఎప్పుడూ ఏదో ఒక పదవి కోసమే చూస్తుంటారు. 

అది చిన్నదా? పెద్దదా అన్నది అనవసరం. కారు నేమ్ ప్లేట్ మీద ఎర్రటి బ్యాక్ గ్రవుండ్ లో రాసుకోవడానికి, ఏదైనా ఆఫీసుకు వెళ్తే ఇవ్వడానికి ఓ విజిటింగ్ కార్డు. నిజానికి చాలా పదవుల వల్ల వచ్చే ఉపయోగం ఏమీ వుండదు. అది జస్ట్ ఓ విజిటింగ్ కార్డు మాదిరిగా ఉపయోగపడుతుంది. అంతే.

తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన కొత్తలో పసుపురంగు డైరీలు ముద్రించేది. దాన్ని కార్యకర్తలు అంతా కోనుగోలు చేసుకునేవారు. 80 వ దశకంలో తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ అదే విజిటింగ్ కార్డు. ఎదైనా ఆఫీసుకు వెళ్తే ముందుగా దాన్ని అధికారి టేబుల్ మీద పెట్టేవారు. ఆ తరువాత విషయం మాట్లాడేవారు.

ఇప్పుడు కొత్త విజిటింగ్ కార్డులు వచ్చాయి. దాదాపు వందకు పైగా పదవుల పంపిణీ చేపట్టారు జగన్. ఇంకా మరింత మందికి పదవులు ఇస్తారని టాక్ వుంది. ఇవేం పదవులు అని తెలుగుదేశం అనుకూల మీడియా రాస్తే రాయొచ్చు. కానీ వాటిని అందుకున్న వారు మాత్రం అలా ఫీలవ్వరు. ఏదో ఒకటి దంపినదానికి బొక్కిందే కూలి అనే టైపులో ఆలోచిస్తారు. 

పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు హయాం తలచుకుని బాధపడుతున్నారు. చంద్రబాబుకు ఎప్పటికీ నామినేషన్ పోస్ట్ ల భర్తీ అంటే ఎందుకో నచ్చదు. లేదా అసంతృప్తి వస్తుందన్న భయం. అందుకే ఆయన వాటిని అలాగే వుంచి కార్యకర్తలను ఊరిస్తూ వెళ్లారు. ఇప్పుడు జగన్ చేస్తున్నది చూసి తెలుగుదేశం జనాలు లోలోపల కచ్చితంగా బాబుగారి వ్యవహారాన్ని గుర్తు చేసుకుంటారు. అదయితే ఖాయం.

ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్లు, వచ్చినా గెలవని వాళ్లు, గెలిచిన ఎమ్మెల్యేల వెంట రెండేళ్లుగా తిరుగుతున్నవాళ్లు, పార్టీకి పనికి వస్తారు అనుకున్న వాళ్లు ఇలా చాలా మంది వున్నారు. వీళ్లందరికీ ఏదో ఒక విజిటింగ్ కార్డు కావాలి. జగన్ ఇప్పుడు ఇచ్చింది అదే. ఇధి వారికి ఎంతో కొంత ఉపయోగం. పార్టీకి ఇంకా ఎక్కువ ఉపయోగం.