క్షత్రియుడు అంటే ఏంటో వైసీపీకి చెందిన రాజు గారు చక్కగా చెప్పారు. ప్రజలను రక్షించేవాడే క్షత్రియుడు తప్ప రెచ్చగొట్టేవాడు కాదని విశాఖ వైసీపీకి చెందిన కేకే రాజు సూత్రీకరించారు.
నిజంగా అదే వాస్తవం. ఆ మాటకు వస్తే ప్రతీ కులానికి మనిషికీ సమాజ బాధ్యత ఉంటుంది. సమాజంలో సభ్యుడిగా తన వంతు పాత్ర నిర్వహించాలి. బుద్దుడు సంఘం శరణం గచ్చామీ అన్నాడు.
సంఘానికి మనిషి బద్ధుడిగా ఉంటూ సంఘాభివృద్ధికి తన వంతుగా పాటుపడాలి. అంతే తప్ప ఆ సంఘంలోని వర్గాలను ఒక్కటిగా బయటకు తీసి చిచ్చు పెట్టడం కాదు.
రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో ఇంకా అప్రమత్తంగా ఉండాలి. కానీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు తాను గెలిచిన పార్టీని విమర్శించే పనిలో భాగంగా శృతి మించేశారని అంటున్నారు. అందుకే ఆయన మీద ఏపీ సీఐడీ కేసులు పెట్టింది. దీంతో ఆయన మీద పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.
ఇక అదే పార్టీలోని ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు కూడా ఇలా చేసే వారికి తమ మద్దతు అసలు ఉండదని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన క్షత్రియ నాయకులు అయితే రాజు తీరు మార్చుకోవాలని కూడా గట్టిగానే చెబుతున్నారు.