వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద కేటీయార్ సంచలన కామెంట్స్..?

కేటీయార్, తెలంగాణ రాష్ట్ర మంత్రి. ఆయనకు విశాఖ గురించి స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు అన్న ప్రశ్న ఎవరికైనా రావచ్చు. కానీ ఎనిమిదేళ్ళ క్రితం వరకూ ఉమ్మడి ఏపీలోనే విశాఖ కూడా ఉంది. ఇపుడు చూడబోతే విశాఖ…

కేటీయార్, తెలంగాణ రాష్ట్ర మంత్రి. ఆయనకు విశాఖ గురించి స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు అన్న ప్రశ్న ఎవరికైనా రావచ్చు. కానీ ఎనిమిదేళ్ళ క్రితం వరకూ ఉమ్మడి ఏపీలోనే విశాఖ కూడా ఉంది. ఇపుడు చూడబోతే విశాఖ స్టీల్ ప్లాంట్ బలిపీఠం మీద ఉంది.

దాంతో కేటీయార్ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద తెలంగాణా శాసనసభలో మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియా అజెండాను చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటున్న బీజేపీ దేశాన ఉన్న ఘనమైన ప్రభుత్వ రంగ సంస్థలను ఏమీ కాకుండా చేసి మరో వైపు పెద్ద ఎత్తున తెగనమ్ముతోందని సభలో కేటీయార్ ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఒకనాడు ఉమ్మడి ఏపీలో అంతా కలసి పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెగనమ్ముతోందని విమర్శించారు. ఏడాదిగా అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయని, జనాలు రోడ్ల మీదకు వచ్చి నెత్తీ నోరూ బాదుకుంటున్నా కూడా కేంద్రం పట్టించుకోవడంలేదని చెప్పడం విశేషం.

తెలుగు రాష్ట్రాల మీద బీజేపీకి ఉన్న అభిమానం ఇదే అని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాదు చూస్తూ ఊరుకుంటే తెలంగాణాలోని సింగరేణి ని కూడా ప్రైవేట్ పరం చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉంటుందని కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణా సమాజం మాత్రం బీజేపీ తెగనమ్ముడు విధానాలను ఎదిరించి తీరుతుందని ఆయన చెప్పడం విశేషం.

మొత్తానికి ఏపీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద కేటీయార్ సానుభూతి వ్యక్తం చేస్తూనే ఏపీలో జనాలు చేస్తున్న‌ పోరాటాలు పెద్ద దూకుడుగా లేవని చెప్పకనే చెప్పారనుకోవాలి. ఏది ఏమైనా స్టీల్ ప్లాంట్ పై ప్రైవేటు ఎపిసోడ్ మాత్రం తెలంగాణాకు ముందు జాగ్రత్త పడడానికి పనికి వచ్చే అంశం కావడమే ఇక్కడ విశేషం.