లంబసింగిలో మంచు కురిసే వేళలో…

మంచు కురిసే వేళలను చూడాలనుకుంటే ఎక్కడో కాశ్మీర్ దాకా వెళ్లాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే ఆంధ్రా కాశ్మీర్ గా విశాఖ జిల్లాలో పేరుపడింది లంబసింగి. Advertisement చింతపల్లికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న…

మంచు కురిసే వేళలను చూడాలనుకుంటే ఎక్కడో కాశ్మీర్ దాకా వెళ్లాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే ఆంధ్రా కాశ్మీర్ గా విశాఖ జిల్లాలో పేరుపడింది లంబసింగి.

చింతపల్లికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిన్న గ్రామం శీతాకాలంలో  మంచు ముద్దగా మారిపోతుంది. సూర్యుడు ఉదయం పది దాటినా కానరాడు, మధ్యాహ్నానికే సెలవు అంటాడు.

ఇక ఇక్కడ డిసెంబర్, జనవరి నెలల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకుంటాయి. ఇక్కడ వాన కంటే దారుణంగా మంచు కురుస్తూనే ఉంటుంది. వణుకుడు అంటే ఏమిటో ఇక్కడకు వస్తే తెలుస్తుంది.  కర్రలాబిగుసుకుపోయే అనుభవం కూడా లంబసింగికి వస్తే అర్ధమవుతుంది.

లంబసింగికి 27 కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లి జలపాతం అందాలు కూడా అదుర్స్ అనేలా ఉంటాయి. ఇక పచ్చదనం నిండుగా పరచుకునే ఈ ప్రదేశంలో పక్షుల కిలకిలరావాలు ప్రకృతిప్రేమికులకు  వేణుగానమే. 

మొత్తానికి వేసవిలోనే పది డిగ్రీల ఉష్ణోగ్రతతో చల్లగా ఉండే లంబసింగి శీతాకాలం మంచుతో కప్పబడి ఉందే కూలెస్ట్ విలేజ్ గా చెప్పుకోవాలి. ఈ సీజ‌న్ లో టూరిస్టుల సందడి కూడా ఎక్కువగానే ఉంటుంది.

కృష్ణ..కృష్ణ..అమరావతిపై సరైన ప్రశ్న