క్రాక్ దర్శకుడికి ఎందుకంత నమ్మకం?

ఇప్పటివరకు అరడజనుకు పైగా సినిమాలు సంక్రాంతికొస్తున్నామంటూ ప్రకటనలు చేశాయి. అయితే అవి ప్రకటనలకే పరిమితమయ్యాయి. ముందుకొచ్చి కచ్చితంగా ఓ తేదీ చెప్పే సాహసం చేయలేకపోయాయి. చివరికి ఫస్ట్ కాపీ చేతిలో పెట్టుకొని సిద్ధంగా ఉన్న…

ఇప్పటివరకు అరడజనుకు పైగా సినిమాలు సంక్రాంతికొస్తున్నామంటూ ప్రకటనలు చేశాయి. అయితే అవి ప్రకటనలకే పరిమితమయ్యాయి. ముందుకొచ్చి కచ్చితంగా ఓ తేదీ చెప్పే సాహసం చేయలేకపోయాయి. చివరికి ఫస్ట్ కాపీ చేతిలో పెట్టుకొని సిద్ధంగా ఉన్న అరణ్య సినిమాకు కూడా ఇప్పటివరకు రిలీజ్ డేట్ చెప్పలేదు.

ఎట్టకేలకు సంక్రాంతి తేదీల పోటీని షురూ చేశాడు రవితేజ. తన కొత్త సినిమా క్రాక్ సంక్రాంతికొస్తుందని ఇప్పటికే ప్రకటించిన ఈ హీరో, తాజాగా ఆ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జనవరి 14న రిలీజ్ చేయబోతున్నారు.

కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా క్రాక్ సినిమాను తెరకెక్కించామని చెబుతున్న గోపీచంద్, ఎందుకో ఈ మూవీపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఎంతలా అంటే.. డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కోసం జీ గ్రూప్ క్రేజీ ఆఫర్ తో సంప్రదింపులు జరిపితే.. ప్రొడ్యూసర్ దగ్గరకెళ్లి స్ట్రయిట్ గా వద్దని చెప్పాడు. సినిమాకు తను గ్యారెంటీ ఇచ్చాడు.

ఇక్కడితో ఆగలేదు ఈ దర్శకుడు. రవితేజకు పెద్దగా మార్కెట్ లేదని తెలిసి కూడా పోటీ ఉన్న సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన కూడా ఇతడిదే. క్రాక్ పై అంత నమ్మకంతో ఉన్నాడు ఈ డైరక్టర్.

ఠాగూర్ మధు నిర్మించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. తమన్ సంగీతం అందించాడు. దర్శకుడి నమ్మకం ఏ మేరకు నిజమౌతుందో సంక్రాంతికి తేలిపోతుంది.

ఏడాదిగా అవే జెండాలూ, అవే మొహాలూ