బొమ్మాళీ వదల అంటూ అరుంధతి లో విలన్ తెగ రెచ్చిపోతూంటాడు. ఆ సినిమా హిట్. ఆ డైలాగ్ కూడా పాపులర్. ఇపుడు ఉత్తరాంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళీ కూడా సేమ్ సీన్ అలాగే ఉందిట. ఈ సంతబొమ్మాళి ఎక్కడో లేదు, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గంలోనే ఉంది.
ఇక ఈ సంతబొమ్మాళిలో శ్రీ పాలేశ్వరస్వామి వారి ఆలయంలో నంది విగ్రహాన్ని జంక్షన్ లోకి తెచ్చి టెన్షన్ రేపిన వారు టీడీపీ వారేనని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు తేల్చారు. ఇక ఈ ఘటనలో అచ్చెన్నాయుడు ప్రమేయం ఎంత అన్న దాని కోసం విచారణకు తాజాగా ఆయన్ని పిలిపించారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు చేసిన హాట్ కామెంట్స్ మీద ఇపుడు సెటైర్లు పడుతున్నాయి. ఆలయంలో చిన్న గీత పడినా తాను ఉరేసుకుంటానంటూ అచ్చెన్న భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. తనకు సంబంధం లేని కేసులో ఇరికించారంటూ వైసీపీ సర్కార్ మీద ఫైర్ అయ్యారు. పోలీసులు వైసీపీ సర్కార్ మాట వింటూ తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోయారు.
ఇవన్నీ సరే కానీ నంది విగ్రహాన్ని ఆలయం ఉంచి బయటకు తరలించింది ఎవరో ఎందుకో మాత్రం అచ్చెన్నాయుడు చెప్పకపోవడాన్నే వైసీపీ నేతలు ఇపుడు తప్పుపడుతున్నారు. అచ్చెన్న భారీ కాయంతో భారీ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తే సరిపోతుందా అంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సంతబొమ్మాళీ కధ ఇంతటితో ఆగదు అని కూడా అంటున్నారు. మొత్తానికి విగ్రహాల విద్వంశం గోల ఏపీలో సాగుతూండగానే సంతబొమ్మాళీలో టీడీపీ కార్యకర్తలు అడ్డంగా దొరికారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక సంతబొమ్మాళ్ళీ నిన్ను వదలనంటూ టీడీపీ పెద్దల వెంట పడడం ఖాయమని వైసీపీ నేతలు చెబుతున్నారు.