లైన్ క్లియర్: భారత్ చూపు.. ఆక్స్ ఫర్డ్ వైపు

భారత ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. కరోనాకి విరుగుడుగా భారత ప్రజలకు తొలి దశలో ఏ కంపెనీ టీకా వేయాలని జరుగుతున్న చర్చకు తెరపడింది. Advertisement స్వదేశీ పరిజ్ఞానంతో భారత్…

భారత ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. కరోనాకి విరుగుడుగా భారత ప్రజలకు తొలి దశలో ఏ కంపెనీ టీకా వేయాలని జరుగుతున్న చర్చకు తెరపడింది.

స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాక్సిన్ ని కాదని, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థ సంయుక్తంగా రూపొందించిన కొవిషీల్డ్ కి భారత నిపుణుల బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఇక డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభిస్తే.. భారత్ లో కొవిషీల్డ్ టీకా పంపిణీకి ఏర్పాట్లు మొదలైనట్టే.

కొవిషీల్డ్ టీకానే ఎందుకు..?

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాక్సిన్ టీకా తుది దశ ప్రయోగాల్లో ఉండటంతో భారత ప్రభుత్వం కొవిషీల్డ్ వ్యాక్సిన్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఇక ఫైజర్ కంపెనీ తయారు చేసిన టీకాకి సంబంధించి.. సదరు సంస్థ భారత నిపుణుల బృందానికి పూర్తి సమాచారం ఇవ్వడంలో జాప్యం చేసింది. 

మరికొంత గడువు కోరింది. దీంతో నిపుణుల బృందం ఆక్స్ ఫర్డ్ తయారీ కొవిషీల్డ్ టీకా పేరుని డీసీజీఐ ముందు ప్రతిపాదించింది. సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ ఆక్స్ ఫర్డ్ సంస్థతో ఒప్పందం మేరకు భారత్ లో ఈ టీకాని తయారు చేస్తోంది. ప్రస్తుతం వీరి వద్ద 5 కోట్ల టీకా డోసులు సిద్ధంగా ఉన్నాయి. మార్చి నాటికి మరో 10 కోట్లు రెడీ అవుతాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కొవాక్సిన్ మార్కెట్లోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా భారత్ లో రెండో రకం కరోనా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈపాటికే డ్రై-రన్ పూర్తి చేసుకుని అన్ని రాష్ట్రాలు టీకా పంపిణీకి సిద్ధం అవుతున్నాయి. దీంతో తొలి దశలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ వైపే కేంద్రం మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

కొవిషీల్డ్ ప్రత్యేకతలు ఏంటి..?

ఫైజర్ టీకా లాగే కొవిషీల్డ్ కూడా తక్కువ ధరకు లభిస్తుంది. దీనిని నిల్వ చేయడం కూడా సులభం. మిగతా టీకాల లాగా అత్యంత శీతల పరిస్థితులు దీనికి అవసరం లేదు. 

సాధారణ టెంపరేచర్ వద్ద కూడా కొవిషీల్డ్ నిల్వచేయొచ్చు. అంటే రవాణా విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. పైపెచ్చు 5కోట్ల డోసులు రెడీగా ఉన్నాయనే సమాచారం ఉంది. దీంతో కేంద్రం కొవిషీల్డ్ ని తుది దశకు ఎంపిక చేసింది.

నెలాఖరులోగా ఫస్ట్ షాట్..

కొవిషీల్డ్ టీకాను రెండు షాట్స్.. అంటే రెండు విడతల్లో ఇవ్వాల్సి ఉంటుంది. తొలి దశ టీకా పంపిణీ కోసం ఈపాటికే రాష్ట్రాలన్నీ కసరత్తులు పూర్తి చేశాయి. డ్రైరన్ పేరుతో వైద్య సిబ్బంది, ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నారు. 

తొలి దశ టీకా ఎవరెవరికి వేయాలి, ఎవరి ద్వారా వేయించాలి, ఎంతమందికి వేయించాలి అనే విషయంపై పూర్తి సమాచారం సిద్ధం చేసుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్రం అనుమతి ఇచ్చి, టీకా సరఫరా చేయడం ఆలస్యం.. వెంటనే టీకా పంపిణీ మొదలవుతుంది. నెలాఖరులోగా భారత్ లో తొలి కరోనా టీకా వేయడానికి కేంద్రం సుముఖంగా ఉంది.

ఇంతవరకూ ఒకా ఛాన్స్ కూడా రాలేదు

సంక్షేమ నామ సంవ‌త్స‌రం!