లాక్ డౌన్ ఫండ్ వచ్చింది.. క్లిక్ చేస్తారా?

“కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. అందులో 2 వేల రూపాయలు మీ వాటాగా నేరుగా ఎకౌంట్ లో పడబోతున్నాయి. క్లెయిమ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. సామాజిక బాధ్యతగా…

“కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. అందులో 2 వేల రూపాయలు మీ వాటాగా నేరుగా ఎకౌంట్ లో పడబోతున్నాయి. క్లెయిమ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. సామాజిక బాధ్యతగా ఈ మెసేజ్ ను మరో 10 మందికి షేర్ చేయండి. మీవాళ్లను, తద్వారా దేశాన్ని కాపాడినవారిగా చిరస్థాయిగా నిలవండి.”

హైదరాబాద్ లో ఉంటున్న చాలామంది మొబైల్ ఫోన్లకు, మెయిల్ ఐడీలకు ఈ సమాచారం వచ్చే ఉంటుంది. కేంద్రం 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిందనేది నిజం. కానీ అందులో తమకు 2వేల రూపాయలు వస్తాయా అనేది చాలామందికి అనుమానం. అది కూడా నేరుగా బ్యాంక్ ఖాతాలో వేస్తారా అనే విషయం చాలామందికి తెలియదు.

ఇది తెలియక కొంతమంది ఆ లింక్ క్లిక్ చేసి అందులో ఎకౌంట్ నంబర్, ఏటీఎం పిన్ నంబర్ ఇస్తున్నారు. అంతే.. క్షణాల్లో వాళ్ల ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. జేబులు గుల్ల అవుతున్నాయి. నిజానికి కేంద్రం ఇలాంటి ప్రతిపాదన ఏదీ ప్రకటించలేదు. కొన్ని ఉన్నప్పటికీ అది నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి వెళ్తుంది తప్ప, ఎవ్వరూ ఎలాంటి లింక్ లు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు.

కేంద్ర ప్రభుత్వం పేరిట, రాజముద్రతో ఉన్న ఈ ప్రకటనపై సైబర్ పోలీసులు దృష్టిపెట్టారు. దీనిపై సుమోటోగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ లింక్ పై క్లిక్ చేసి ఇప్పటికే పలువురు నష్టపోయారు. ఈ సమాచారాన్ని ఎవ్వరూ ఫార్వార్డ్ చేయొద్దని, వ్యక్తిగత సమాచారాన్ని అందించొద్దని, లింక్ వచ్చిన వెంటనే డిలీట్ చేయాలని పోలీసులు చెబుతున్నారు. 

ఇక నుంచి నో లంచం నో దళారీ

కోహ్లీ.. గాలిలో చప్పట్లతో