స్థానిక పోరు సాక్షిగా తుస్సుమనిపించిన లోకేష్

సార్వత్రిక ఎన్నికల సందర్భంలోనే టీడీపీ వారసుడిగా ప్రచారం చేయించుకున్న చినబాబు అలియాస్ నారా లోకేష్ పనితీరు ఏంటో తేలిపోయింది. తెలుగుదేశం పార్టీని నడిపే సామర్థ్యం అతనికి లేదని పార్టీ శ్రేణులే బలంగా నమ్మాయి. లోకేష్…

సార్వత్రిక ఎన్నికల సందర్భంలోనే టీడీపీ వారసుడిగా ప్రచారం చేయించుకున్న చినబాబు అలియాస్ నారా లోకేష్ పనితీరు ఏంటో తేలిపోయింది. తెలుగుదేశం పార్టీని నడిపే సామర్థ్యం అతనికి లేదని పార్టీ శ్రేణులే బలంగా నమ్మాయి. లోకేష్ వ్యవహారశైలితో రానురాను ఆ నమ్మకానికి మరింత బలం చేకూరుతోంది. చంద్రబాబు ఎంతలా జనంలోకి వస్తుంటే, లోకేష్ అంతలా చీప్ అయిపోతున్నారు. ఈ వయసులో బాబుకి ఈ కష్టమేంటి అనుకునేవారంతా.. కొడుకు ప్రయోజకుడైతే ఈ తిప్పలు తప్పేవి కదా అని నిట్టూరుస్తున్నారు.

కేవలం టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణుల్లోనే కాదు, సామాన్య ప్రజల్లో కూడా లోకేష్ ఓ అసమర్థుడిలా మిగిలిపోతున్నారు. లోకేష్ అనే వ్యక్తి ఎలా ఉన్నా రాష్ట్రానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు కానీ, ఏపీలో రాజకీయం మరీ ఏకపక్షంగా మారిపోయిందని చెప్పడానికి మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఎంత మంచి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నా.. అధికార పక్షాన్ని నిలదీసే గట్టి మనిషి ఒకరు ప్రతిపక్షంలో ఉండాలి. పవన్ కల్యాణ్ చూడబోతే ఇప్పటికే చేతులెత్తేసి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు, బీజేపీకి నాయకత్వ సమస్య ఉండనే ఉంది. టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా.. భవితకు భరోసా ఇచ్చే నాయకుడు లేకపోవడమే పెద్ద మైనస్.

విశాఖలో చంద్రబాబుకి చీదరింపులు జరిగితే.. కనీసం రోడ్డుమీదకు వచ్చి నిరసన కూడా తెలియజేయలేని నిస్సహాయుడు లోకేష్. స్థానిక ఎన్నికల్లో అన్ని గొడవలు జరుగుతుంటే.. ట్విట్టర్ దిగని పిరికివాడు చినబాబు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలతో విసిగిపోయి సగం మంది పార్టీ మారుతుంటే, భవిష్యత్ లో లోకేష్ వంటి అసమర్థుడి కింద పనిచేయాల్సి వస్తుందేమోనన్న భయంతో చాలామంది పక్క చూపులు చూస్తున్నారు.

అధికార పక్షం ఎంత బలంగా ఉన్నా.. జగన్ ఎన్ని మంచి పథకాలు అమలు చేసినా, ప్రతిపక్షం లేకపోతే ఆ రాష్ట్ర రాజకీయం రంజుగా ఉండదు. రాబోయే రోజుల్లో ఏపీ పరిస్థితి అలాగే తయారవుతుంది. జగన్ ఏకఛత్రాధిపత్యం ముందు మనగలిగే అసలు సిసలు నేతలెవరూ ఇప్పటి వరకూ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేదు. వారసుడు లోకేష్.. ఎప్పటికీ ఆ స్థాయికి ఎదగలేరు. రాబోయే రోజుల్లో టీడీపీకి ఇంకా గడ్డుకాలమే అని చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలే ఉదాహరణ.

నేను గ్యాప్ తీసుకోలేదు.. వచ్చింది