సీఎం జగన్‌పై ఏదో ఒక బురద చల్లాలి, అందుకు ఒక సందర్భాన్ని పట్టుకోవాలి…ఇదీ చంద్రబాబు వైఖరి. అంతే తప్ప, తాను విచక్షణతో మాట్లాడుతున్నానా లేదా అనే స్పృహ ఆయనలో ఏ మాత్రం కనిపించడం లేదు. రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ వచ్చారు. అమెరికా అధ్యక్షుడి గౌరవార్థం రాష్ట్రపతి విందు ఇచ్చారు. ఈ విందుకు దేశంలోని 8 మంది సీఎంలను మాత్రమే ఆహ్వానించారు. వీరిలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఒకరు.
సీఎం జగన్‌పై విమర్శలకు బాబుకు ఓ ‘ట్రంప్’ కార్డు దొరికింది. జగన్‌పై క్రిమినల్ కేసులు ఉన్నందు వల్లే ట్రంప్ విందుకు పిలుపు రాలేదని బాబు విమర్శించాడు. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ప్రజాచైతన్యయాత్ర రెండో రోజు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘సీఎం జగన్ మీద అనేక క్రిమినల్ కేసులున్నాయనే ట్రంప్ పర్యటన సందర్భంగా పిలుపు రాలేదు. అమెరికా చట్టం చాలా నిక్కచ్చిగా ఉంటుంది. ఇలాంటి ఆర్థిక నేరగాళ్లను వాళ్లు దూరంగా పెడతారు’ అని చంద్రబాబు విమర్శలకు దిగాడు.
ఇంకా ఆయన ఏమన్నాడంటే…
‘టీడీపీ హయాంలో దేశవిదేశాలకు చెందిన అధినేతలు, కార్పొరేట్ సంస్థల సీఈవోలు మన రాష్ట్రానికి వచ్చారు. ఇక్కడి పాలనా పద్ధతులనూ, అభివృద్ధినీ ప్రశంసించారు. అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ రాక సందర్భంగా కనీసం మన ముఖ్యమంత్రికి ఆహ్వానం లేకపోవడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఆర్థిక నేరస్థుడు కాబట్టే జగన్‌కు కేంద్రప్రభుత్వం నుంచి పిలుపందలేదు’ అని బాబు ఘాటుగా విమర్శించాడు.
ఈ మాటలు చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం. దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కేంద్రం ఆహ్వానించలేదు. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్ సీఎంలను, పశ్చిమబెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల సీఎంలను కూడా కేంద్రం ఆహ్వానించలేదు. బాబు చెప్పే ప్రకారం వీళ్లంతా కరడు గట్టిన ఆర్థిక నేరస్తులేనా? తమరి పాలనా పద్ధతులను, అభివృద్ధిని దేశవిదేశాల అధినేతలు ప్రశంసించి ఉంటే, రాష్ట్ర ప్రజలు ఎందుకు తిరస్కరించారు సారూ!
మాట్లాడే ముందు కాస్తా బుద్ధిని ప్రదర్శించండి బాబు గారూ. ఆయన మాట్లాడే తీరు చూస్తుంటే, బాబుకు మైండ్ దొబ్బినట్టనిపిస్తోంది. తన తండ్రిని మంచి మెంటల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి లోకేశ్ చూపించాల్సిన సమయం వచ్చింది. లోకేశా! మంచి పనికి ఆలస్యం ఎందుకయ్యా?