ఇంకోసారి ఓడితే కానీ లోకేష్ కు అర్థం కాదా?

మ‌హారాష్ట్ర‌లో ముఖ్య‌మంత్రి చెంప ప‌గులగొట్టే వాడిని.. అంటూ వ్యాఖ్యానించిన కేంద్ర‌మంత్రిని అరెస్టు చేశారు పోలీసులు.  ఆ అరెస్టు విష‌యంలో ముంద‌స్తు బెయిల్ ను ఆశ్ర‌యించిన కేంద్ర‌మంత్రికి కోర్టులో కూడా ఊర‌ట ల‌భించ‌లేదు. ఆ కేసులు-…

మ‌హారాష్ట్ర‌లో ముఖ్య‌మంత్రి చెంప ప‌గులగొట్టే వాడిని.. అంటూ వ్యాఖ్యానించిన కేంద్ర‌మంత్రిని అరెస్టు చేశారు పోలీసులు.  ఆ అరెస్టు విష‌యంలో ముంద‌స్తు బెయిల్ ను ఆశ్ర‌యించిన కేంద్ర‌మంత్రికి కోర్టులో కూడా ఊర‌ట ల‌భించ‌లేదు. ఆ కేసులు- సెక్ష‌న్ల‌లో అరెస్టులు స‌మంజ‌స‌మే అని కోర్టు స్ప‌ష్టం చేసింది. అయితే ఆ కేంద్ర‌మంత్రికి అరెస్టు అయిన వెంట‌నే బెయిల్ అయితే ల‌భించింది. అది వేరే క‌థ‌.

ఇక ఏపీ విష‌యానికి వ‌స్తే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ల‌క్ష్యంగా చేసుకుని ఉద్రేక‌పూర్వ‌క‌మైన వ్యాఖ్య‌ల‌ను చేయ‌డాన్ని కొన‌సాగిస్తూ ఉన్నాడు తెలుగుదేశం నేత నారా లోకేష్.  ఆ మ‌ధ్య క‌ర్నూలుకు వెళ్లిన‌ప్పుడు లోకేష్ మాట్లాడుతూ సీఎంను ఉద్దేశించి, రేయ్.. ఒరేయ్.. అంటూ వ్యాఖ్యానించాడు. ఇలా లోకేష్ త‌న అస‌హ‌నాన్ని చాటుకున్నాడు. ఇక పోల‌వ‌రం నిర్వాసితుల స‌మ‌స్య అంటూ వెళ్లి లోకేష్ అక్క‌డ‌ గాలిగాడు.. అంటూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఉద్దేశించి వ్యాక్యానించాడు.

ఇదీ లోకేష్ తీరు. ఇలా మాట్లాడ‌టం లోకేష్ కొత్త కాదు. ముఖ్య‌మంత్రిని ఉద్దేశించి, వాడూ -వీడూ, నీ అమ్మ మొగుడా.. వంటి ప‌దాల‌ను వాడుతున్నారు లోకేష్. ఇలాంటి మాట‌లు త‌న‌నో మాస్ లీడ‌ర్ ను చేస్తాయ‌ని లోకేష్ న‌మ్ముతూ ఉండ‌వ‌చ్చు. 

ఇలా మాట్లాడితే త‌ప్ప జ‌నాలు లోకేష్ ను సీరియ‌స్ గా తీసుకోర‌ని ఎవ‌రో రాజ‌కీయ స‌ల‌హాదారు చెప్పార‌ట‌. అందుకే అప్ప‌టి నుంచి లోకేష్ బూతులు మొద‌లుపెట్టారు. పీకుతారా, పీక‌బోతున్నారా, పీకారా.. అంటూ  ఆ మ‌ధ్య రెచ్చిపోయాడు. అవ‌త‌ల చంద్ర‌బాబు కూడా అదే మాటలే మాట్లాడాడు. తండ్రీ అదే కూత‌, కొడుకూ అదే కూత‌.. ఏంట‌య్యా ఇది థూ.. అని జ‌నాలు అస‌హ్యించుకునే స‌రికి ఆ ప‌దాల‌ను ప‌క్క‌న పెట్టారు.

ఇక ఇప్పుడు లోకేష్ కావాల‌ని రెచ్చ‌గొట్టే ప్ర‌క‌ట‌న‌లు, ఈ వ‌ల్గ‌ర్ భాష‌ను ఉప‌యోగిస్తున్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. త‌ను ఇలా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు త‌న‌పై రెచ్చిపోతార‌ని, అలా అయితేనే వాళ్లు త‌న‌పై రియాక్ట్ అయ్యే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని లోకేష్ వ్యూహం కాబోలు. రెచ్చ‌గొట్టే భాష‌తో లోకేష్ ఒక‌టీ రెండు రోజులు వార్త‌ల్లో నిల‌వొచ్చేమో కానీ, దీర్ఘ‌కాలంలో ఇలాంటి భాష ప‌నికిరాద‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. కాస్త విజ్ఞ‌త ఉన్న ఎవ‌రికైనా ఇది అర్థం అవుతుంది.

ఈ విష‌యంలో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ స్టోరీతో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఉన్నాడు. తాట తీస్తా, కాళ్లు విర‌గొడ‌తా.. ఇలాంటి మాట‌ల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా వాడాడు. అయితే వాటికి ఓట్లు రాల‌లేదు. ప‌వ‌న్ అలాంటి మాట‌లు లేవిప్పుడు. అయితే లోకేష్ మాత్రం అంత‌క‌న్నా తీవ్రంగా.. పీకుతారా, లాగుతారా… అంటూ మాట్లాడుతున్నారు. ఈ మాట‌ల‌ను సినిమా వాళ్లు జ‌న‌ర‌లైజ్ చేసిన‌ప్ప‌టికీ.. ఈ మాట తీరును జనాలు ఇంకా అస‌హ్యించుకునే స్థితిలో ఉన్నార‌ని లోకేష్ ఎప్ప‌టికి గ్ర‌హించేనో, ఇంకో ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌నా?