లోకేష్ హారతి రాజకీయం.. మరో ప్రహసనం!

ఇలాంటి హారతి రాజకీయాలతో జనాలు విసిగిపోయారని తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకోలేకపోతోంది. నీళ్లు వెళ్లిన చోటకళ్లా హారతులు ఇచ్చి తామేదో ఉద్దరించినట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్లు చెప్పదలుచుకుంటున్నారు. గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ అధినేత…

ఇలాంటి హారతి రాజకీయాలతో జనాలు విసిగిపోయారని తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకోలేకపోతోంది. నీళ్లు వెళ్లిన చోటకళ్లా హారతులు ఇచ్చి తామేదో ఉద్దరించినట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్లు చెప్పదలుచుకుంటున్నారు. గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని చోట్ల హారతులు ఇచ్చారో అందరికీ తెలిసిందే!

అనంతపురం జిల్లా వరకూ వెళ్లి ప్రతి ఏడాది హారతులు ఇచ్చి వచ్చారు చంద్రబాబు నాయుడు. హంద్రీనీవా విషయంలో అలాంటి డ్రామాలు వేశారు. అయితే ప్రజలు ఏమీ అమాయకులు కాదు. హంద్రీనీవా విషయంలో ఎవరి హాయాంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. దీంతో చంద్రబాబు నాయుడి హారతులకు ఓట్లు పడలేదు.

చంద్రబాబు హారతి ఇచ్చి వచ్చిన చోటల్లా తెలుగుదేశం చిత్తు చిత్తుగా ఓడిపోయింది! అయినా టీడీపీ తీరు మారలేదు. ఇప్పుడు హారతి పల్లెం చేతులు మారింది. లోకేష్ దాంతో రాజకీయం చేస్తున్నారు. పట్టిసీమ ద్వారా నీళ్లు వచ్చాయంటూ లోకేష్ హరతి ఇచ్చే ప్రోగ్రామ్ చేశారు.

అదంతా చంద్రబాబు ఘనత అని చెప్పుకోవడం లోకేష్ ఉద్దేశం. అయితే ఆ నీళ్లు వచ్చిన కాలువ నిర్మాణం ఎనభై శాతం వైఎస్ హయాంలో నిర్మితం అయినది, పోలవరంలో భాగంగా నిర్మితం అయినదే. ఆ విషయం జనాలకు తెలియదన్నట్టుగా లోకేష్ హారతి డ్రామా ఆడారు. ఇలాంటి డ్రామాలను నమ్మరు అని ఎన్నికల ఫలితాలతోనే అర్థం అయినా తెలుగుదేశం పార్టీ మాత్రం వాటినే నమ్ముకోవడం గమనార్హం!

అన్నా.. జగనన్నా.. చేర్చుకో అన్నా!