మళ్లీ కామెడీ.. లోకేష్ సిగ్గులేని మాటలు

అఖండ మెజారిటీతో గెలిచారు వైఎస్ఆర్సీ అధ్యక్షుడు జగన్. తిరుగులేని ప్రజామద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకా చెప్పాలంటే దేశంలో జవహర్ లాల్ నెహ్రూ, పీవీ నరసింహారావు తర్వాత ఆ స్థాయి భారీ విజయం జగన్ దే.…

అఖండ మెజారిటీతో గెలిచారు వైఎస్ఆర్సీ అధ్యక్షుడు జగన్. తిరుగులేని ప్రజామద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకా చెప్పాలంటే దేశంలో జవహర్ లాల్ నెహ్రూ, పీవీ నరసింహారావు తర్వాత ఆ స్థాయి భారీ విజయం జగన్ దే. చరిత్ర చెబుతున్న వాస్తవం ఇది. ఈ స్థాయిలో సీట్లు సంపాదించిన తర్వాత మళ్లీ పక్క పార్టీలో ఎమ్మెల్యేల వైపు చూడాల్సిన అవసరం జగన్ కు లేదు. అందుకే వైసీపీలోకి రావాలనుకంటే అన్ని పదవులకు రాజీనామాలు చేసి రావాలంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కళ్లముందు ఇంత జరుగుతున్నప్పటికీ లోకేష్ కు అది కనిపించనట్టుంది. తనదైన శైలిలో మరో కామెడీ షురూ చేశారు.

టీడీపీ నాయకులపైన వైసీపీ వాళ్లు కేసులు పెడుతున్నారట. వాళ్లను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారట. వైసీపీలోకి వస్తే కేసులు ఎత్తేస్తామని, లేదంటే మరిన్ని కేసులు పెడతామని బెదిరిస్తున్నారట. ఇలా లొంగదీసుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు లోకేష్. తండ్రి చంద్రబాబు తరహాలో లోకేష్ కూడా కళ్లు పెద్దవి చేసి ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చేసరికి, అనుకూల మీడియా దాన్నే హెడ్ లైన్ చేసి పడేసింది. కనీసం లోకేష్ చెప్పిన మేటర్ లో లాజిక్ ఏంటనే విషయాన్ని కూడా ఆలోచించలేకపోయింది ఆ “గుడ్డి” మీడియా.

ఓవైపు టీడీపీ నాయకులే మేం వైసీపీలోకి వస్తాం అంటూ సందేశాలు పంపుతున్నారు. తెలిసిన వాళ్లతో తెగ లాబీయింగ్ లు చేస్తున్నారు. అవసరమైతే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు కూడా చేస్తామంటున్నారు. గంటా నుంచి వల్లభనేని వరకు ఎవర్ని కదిపినా ఈ మేటర్ చెబుతారు. ఇలా టీడీపీ జనాలు వస్తామంటూ తోసుకొస్తుంటే.. స్వయంగా వైసీపీ నేతలు ఆపుతున్నారు. మాకొద్దు బాబోయ్ ఈ చేరికలు అంటూ సున్నితంగా తిరస్కరిస్తున్నారు.

ఇవన్నీ జనాలకు తెలిసిన బహిరంగ రహస్యాలే. పాపం ట్విట్టర్ లో కాలక్షేపం చేసే లోకేష్ కు మాత్రం ఈ ఓపెన్ సీక్రెట్స్ తెలియలేదు. అక్కడికేదో ఎమ్మెల్యేలు లేక వైసీపీ అవస్థలు పడుతున్నట్టు, టీడీపీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు ఎర్రతివాచీ పరుస్తున్నారనే భ్రమలో బతికేస్తున్నారు లోకేష్. ఆ భ్రమల్లోంచి వచ్చినవే ఈ స్టేట్ మెంట్స్. లోకేష్ ఇలా స్పందించడం వెనక మరో రీజన్ కూడా ఉంది. జగన్ అంత మెజారిటీ కాకపోయినా, గడిచిన టర్మ్ లో చంద్రబాబుకు కూడా మెజారిటీ వచ్చింది. ప్రభుత్వాన్ని స్థాపించేంత మెజారిటీని ఆయన సొంతం చేసుకున్నారు. కానీ బాబు తన వక్రబుద్ధి వీడలేదు.

వైసీపీ నుంచి ఏకంగా 23 మంది ఎమ్మెల్యేల్ని సంతలో పశువుల్ని కొన్నట్టు కొనేశారు. ఇప్పుడు లోకేష్ చెబుతున్న బెదిరింపులు, ప్రలోభాలన్నీ అప్పుడు బాబు హయాంలో విచ్చలవిడిగా నడిచాయి. కొందరికి కాంట్రాక్టులిచ్చారు, మరికొందరిపై కేసులు పెట్టారు, మరికొందరికి ఏకంగా మంత్రి పదవులు కూడా ఇచ్చారు. సరిగ్గా ఇలాంటి కార్యకలాపాలే జగన్ హయాంలో కూడా జరుగుతున్నాయనే భ్రమలో ఉన్నారు చినబాబు. అయినా ఇక్కడ తప్పు లోకేష్ ది కాదులెండి. ఆయనకు రాసిచ్చిన స్క్రిప్ట్ అలా ఉంది మరి. 

మునిగిపోయిన టిడిపి ఇప్పట్లో పైకి తేలడం కష్టమే