అదిగో పవన్-ఇదిగో క్రిష్ అన్నంతగా వార్తలు వినిపించేస్తున్నాయి. క్రిష్ కావాలనే గ్యాసిప్ లు తనకు అనుకూలంగా వదలుతున్నారనే మాట కూడా వినిపిస్తోంది.
కథానాయకుడు-మహానాయకుడు సినిమా తరువాత చేతిలోకి సినిమా రాని పరిస్థితుల్లో క్రిష్ తెగ ఇబ్బంది పడుతున్నారని, అదే సమయంలో పవన్ సినిమా గురించి తెగ ఆరాట పడుతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అందులో భాగంగానే కథ చెప్పేసారని, ఓకె అయిపోయిదని, ఎవరు వదిలారో కానీ తెగ లీకులు వదిలేసారు. అవి అలాగే చలామణీ అయిపోయాయి.
ఇలాంటి నేపథ్యంలో పవన్ కు అందరికన్నా ముందు అడ్వాన్స్ ఇచ్చి, లైన్లో ముందు వున్న మైత్రీ మూవీస్ అధినేతలు కూడా పవన్ ను కలిసినట్లు తెలుస్తోంది.
పవన్ తో సినిమా కోసం స్క్రిప్ట్ రెడీగా పట్టుకుని వున్న హరీష్ శంకర్ ను తీసుకుమరీ పవన్ ను కలిసినట్లు తెలుస్తోంది.
మీడియాలో వస్తున్న పింక్ రీమేక్, క్రిష్ సినిమాల గురించి పవన్ దగ్గర ప్రస్తావించగా, తను ఇంకా ఏమీ డిసైడ్ చేసుకోలేదని, అసలు ఏ కథలు వినలేదని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది.
అసలు ఈ లీకులు అన్నీ ఎలా వస్తున్నాయి అని పవన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ముహూర్తం పెట్టేసారని, షూటింగ్ స్టార్ట్ డిసెంబర్ నుంచి అని ఎవరు అధికారికంగా చెప్పారని పవన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.
మొన్నటికి మొన్న తన ఫామ్ హవుస్ లో ఫొటోలకు ఫోజులు ఇస్తూ పశువులకు అరటిపళ్లు తినిపించినపుడు కూడా పక్కన వున్న ఆయన వ్యక్తిగత సిబ్బంది సినిమా సంగతి అడగగా, కొత్త ఏడాదిలో చూద్దాం అని బదులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదంతా చూస్తుంటే పవన్ సినిమా విషయంలో అటు క్రిష్ వైపు నుంచో, ఇటు పవన్ వైపు నుంచో అసత్యాలు బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది.
నవంబర్ లో ఓపెనింగ్ డిసెంబర్ లో షూటింగ్ వుంటే పవన్ క్యాంప్ నుంచి అబద్దాలు వచ్చినట్లు, అలా కాకుంటే క్రిష్ క్యాంప్ నుంచి అబద్దాలు వచ్చినట్లు ఖరారవుతుంది. అందుకోసం కొన్నాళ్లు వెయిట్ చేయాలి.